Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ స్లోగన్: 400కే పార్

2019 ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ కొత్త నినాదాలను ప్రచారంలోకి తీసుకొచ్చింది.  

bjp slogans for upcoming elections
Author
New Delhi, First Published Mar 5, 2019, 5:43 PM IST

న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ కొత్త నినాదాలను ప్రచారంలోకి తీసుకొచ్చింది.  

గత ఎన్నికల సమయంలో  అబ్‌కీ బార్, మోడీ సర్కార్ అనే నినాదం వర్కవుట్ అయింది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ 336 సీట్లను కైవసం చేసుకొంది.దీంతో వచ్చే ఎన్నికల్లో కూడ పాత స్లోగన్‌కు కొనసాగింపుగా  అబ్‌కీ బార్ , 400 కే పార్ అనే స్లోగన్  తెచ్చింది. అబ్‌కీ బార్ ఫిర్ మోడీ సర్కార్ అనే నినాదాన్ని కూడ వాడుతోంది. మరోసారి మోడీ సర్కార్ అధికారంలోకి రావాలని ఈ స్లోగన్ బీజేపీ ప్రజల్లో ప్రచారానికి పెట్టింది.

అజేయ భారత్, అటల్ బీజేపీ అనే నినాదాన్ని  తెచ్చింది. వాజ్‌పేయ్ గత ఏడాది మృతి చెందారు. ఆయనకు నివాళిగా బీజేపీ ఈ నినాదాన్ని తెచ్చింది. సాఫ్ నియత్ సహీ వికాస్ అనే నినాదం కూడ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. తమ లక్ష్యాలు ఉన్నతమైనవి, మా దారి కూడ సరైందేనని, సరైన అభివృద్ధి అంటూ బీజేపీ ఈ నినాదాన్ని ప్రచారానికి పెట్టింది.

భవిష్యత్తు తరాలకు ఈ బంగారు బాటలు వేసేలా ప్లాన్ చేస్తున్నామని బీజేపీ చెబుతోంది.  కహో దిల్ సే, నమో ఫిర్‌సే అంటూ నినాదం చేసింది.  మరోసారి మోడీ అధికారంలోకి రావాలని మనసారా కోరుకోవాలని బీజేపీ కోరుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios