Asianet News TeluguAsianet News Telugu

రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే: జగన్‌పై చంద్రబాబుదే పైచేయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీ హవా కొనసాగుతోందని రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. ఏపీ రాష్ట్రంలోని 25 ఎంపీ  స్థానాలకు గాను టీడీపీ 14 ఎంపీ స్థానాలను గెలుచుకొంటుందని ఆ సంస్థ ప్రకటించింది.
 

tdp will get majority mp seats in andhra pradesh in 2019 elections
Author
Amaravathi, First Published Apr 9, 2019, 10:34 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీ హవా కొనసాగుతోందని రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. ఏపీ రాష్ట్రంలోని 25 ఎంపీ  స్థానాలకు గాను టీడీపీ 14 ఎంపీ స్థానాలను గెలుచుకొంటుందని ఆ సంస్థ ప్రకటించింది.

ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుండి ఏపీ రాష్ట్రంలో పరిస్థితిలో మార్పులు వచ్చినట్టుగా ఆ సంస్థ అభిప్రాయపడింది.అంతకు ముందు ఉన్న వాతావరణం  టీడీపీకి అనుకూలంగా మారిందని ఆ  సంస్థ  తేల్చి చెప్పింది. టీడీపీకి 42.8 శాతం ఓట్లు వస్తాయని రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే అభిప్రాయపడింది.

ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 ఎంపీ స్థానాలు దక్కుతాయని ఆ సంస్థ ప్రకటించింది. వైఎస్ఆర్‌సీపీ గెలుచుకొనే 11 ఎంపీ స్థానాల్లో వైసీపీ, టీడీపీ మధ్య చాలా స్వల్ప తేడా మాత్రమే ఉంటుందని  కూడ ఆ సంస్థ వివరించింది. అయితే ఈ నాలుగు ఎంపీ స్థానాలు కూడ టీడీపీకి దక్కే అవకాశం ఉందని ఆ సంస్థ అభిప్రాయపడింది.

ఈ ఏడాది జనవరి 24వ తేదీన ఇదే  సంస్థ నిర్వహించిన సర్వేలో  వైసీపీకి 19 ఎంపీ స్థానాలు దక్కుతాయని ప్రకటించింది. టీడీపీకి  కేవలం 6 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని  తేల్చింది. అయితే రెండు మాసాల వ్యవధిలోనే ఓటరు తీరులో మార్పులు చోటు చేసుకొన్నాయని ఆ సంస్థ అభిప్రాయపడింది.

రాష్ట్రంలో టీడీపీకి 38.5 శాతం ఓట్లు దక్కుతాయని, వైసీపీకి36.5 శాతం వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ తేల్చింది. మరో వైపు కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడ దక్కదని ఆ సంస్థ స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్‌కు 10.4 శాతం, బీజేపీకి 6.5 శాతం, ఇతరులకు 8.2 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని ఆ సంస్థ తేల్చి చెప్పింది.

ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన సర్వేలో  వైసీపీకి 41.3 శాతం, టీడీపీకి 33.1 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో జనసేనకు 8.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది.

సంబంధిత వార్తలు

రూరల్ మీడియా సర్వే: చంద్రబాబు వర్సెస్ జగన్, ప్లస్ లూ, మైనస్‌లూ

రూరల్ మీడియా సర్వే: ఏపీలో జిల్లాల వారీగా పార్టీలకు వచ్చే సీట్లివే

సర్వే: మెజారిటీ ఎంపీ సీట్లు బాబుకే, జగన్‌కు 9 సీట్లే

అసెంబ్లీ ఎన్నికల సర్వే: బాబుదే పై చేయి, వెనుకంజలో జగన్, పవన్ జీరో

తాజా సర్వే: జగన్‌దే హవా, పవన్ నామమాత్రమే

Follow Us:
Download App:
  • android
  • ios