Asianet News TeluguAsianet News Telugu

ఎగ్జిట్ పోల్ ఫలితాలు: యూపీలో బీజేపీకి భారీ నష్టం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ కూటమి బీజేపీని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి

loksabha elections 2019 exit polls:sp- bsp alliance will get majority seats from uttar pradesh
Author
New Delhi, First Published May 19, 2019, 9:03 PM IST

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ కూటమి బీజేపీని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మాదిరిగానే రెండు సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 71 ఎంపీ స్థానాలు ఈ రాష్ట్రం నుండి దక్కిన విషయం తెలిసిందే.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2014 ఎంపీ ఎన్నికల సమయంలో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ రాష్ట్రంలో మకాం వేశారు. ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. మోడీ వారణాసి నుండి పోటీ చేయించారు.  

దీంతో యూపీ రాష్ట్రంలో  బీజేపీకి 71, ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న అప్నాదళ్‌కు రెండు ఎంపీ స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ ఆమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ 5 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది.

ఈ దఫా మాత్రం బీజేపీకి తక్కువ సీట్లే ఈ రాష్ట్రం నుండి దక్కే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి.  సీ ఓటరు సర్వే ప్రకారంగా ఎస్పీ, బీఎస్పీ కూటమికి 40 ఎంపీ సీట్లు, బీజేపీకి 38 ఎంపీ సీట్లు, కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కనున్నాయి. ఏబీపీ- నీల్స్ సర్వే ప్రకారంగా ఎన్డీఏ కూటమికి 22 సీట్లు, ఎస్పీ-బీఎస్పీ కూటమికి 56  ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని  తేల్చి చెప్పింది.

సీ ఓటరు

ఎస్పీ, బీఎస్పీ 40

బీజేపీ  38

కాంగ్రెస్ 02

ఏబీపీ- నీల్సన్ 

ఎన్డీఏకు -22
ఎస్పీ- బీఎస్పీ 56

Follow Us:
Download App:
  • android
  • ios