అందనంత ఎత్తుకు వెళ్లి అంగారక గ్రహంలో కాపురం చెయ్యొచ్చు
పాతాళం నుంచి పసిడిని తీసుకురావచ్చు 
కంప్యూటర్ టెక్నాలజీతో  కాలాన్ని కూడా కంట్రోల్ చేయవచ్చు
మర మనుషులతో  మహాద్భుతాలు సృష్టించవచ్చు 
                     కానీ  
మనిషి మలాన్ని  తీయడానికి మాత్రం  మనిషే  కావాలి!

జానెడు కడుపు నింపు కోవడానికి మలానికి మర్దన చేయాలి   
విష వాయువులని  అత్తరు-పన్నీరు లాగా  స్వీకరించాలి 
డ్రైనేజీలో దిగి ఊపిరాడక  తన్నుకుని చస్తూనే ఉండాలి
రిజర్వేషన్ల ఊసెత్తని,  పోటీ తలెత్తని ఈ ఉద్యోగానికి మాత్రం
సమాజానికి దూరంగా విసిరివేయబడ్డ 
ఆ దళిత బిడ్డలే కావాలి! ఆ దళిత బిడ్డలే చావాలి!!