మిత్రమా మనం యవ్వనాన్ని కోల్పోయాం 
నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను
మనం ఎందుకు పుట్టాం ?
మనమింకా ఎందుకు చావలేదు? 
ఇంకా ఎందుకీ అందమయిన పేర్లు ?
మనం యుగాంతం కోసం వేచి వుండాలి 
మరి నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను
తూఫాన్ లా అర్థం లేని ఈ ప్రపంచం లాగే 
నేనూ కష్టమయిన తల రాతనే కోరుకున్నాను 
మరి నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను
ఎన్నో కోకిలలు ఈ తోటలోకి వచ్చాయి 
వాటి పాత్రల్ని అవి పోషించాయి
కోకిలలకు చోటివ్వడానికి తోటలోని 
పువ్వులన్నీ వెళ్లిపోయాయి 
మరి నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను
నరకపు అగ్ని కీలలు మొప్పిరిగొన్న రోజు 
దయచేసి నన్ను రక్షించండి 
హెబ్బా ఖాథూన్ నిన్ను పిలుస్తుంది
మరి నేనేమో రోజంతా దారిలోనే ఓడిపోయాను.

కాశ్మీరీ మూలం :   హెబ్బా ఖాతూన్ 
తెలుగు అనువాదం : వారాల ఆనంద్