కాలం మాయాజాలానికి కవిత్వపు ఊరట " అనిమేష"

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం డాక్టర్ నందిని సిద్దారెడ్డి “అనిమేష” అందిస్తున్నారు వారాల ఆనంద్.

Varala Anand writes on Nandini Sidha Reddy Animesha

“Don’t mingle,
Always single,
When carelessness increases
lation decreases” అన్నాడో ఆంగ్ల కవి

ఆ పరిస్థితిలో డాక్టర్ నందిని సిద్దారెడ్డి “అనిమేష” కావ్యం రాసాడు. ఆ కావ్యాన్ని అందుకున్నాను  దాని ఈ గురించి నాలుగు మాటలు...

“చూసావా ఇవ్వాళ
లోకాన్ని ఆవరించిన చీకటికి
ప్రహారీ గోడల్లేవు
అలుపెరుగకుండా విస్తరిస్తున్న చీకటికి
సరిహద్దుల్లేవు
శవాల్ని బుజానేసుకుని నిలబడ్డ
ఈ చీకటి ఎక్కడ మొదలయిందో తెలీదు
పట్టుకుందామంటే దొరకదు
ఎన్ని వలలు విసిరీ దొరక బుచ్చుకోలేము
అదంతే
కడుపు చించుకుంటే
కాళ్ళ మీద బడుతుంది “ సరిగ్గా ఇదీ ఇవ్వాల్టి ప్రపంచ పరిస్థితి.  బహుశా మానవాళి ఎన్నడూ కనీసం ఊహించనయినా ఊహించని స్థితి. అది కరోనా రక్కసి దాడి.  ఒక ప్రాంతమని కాదు ఒక మనిషి అని కాదు యావత్తు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన మహమ్మారి కోవిడ్.

‘కోవిడ్ కత్తి
ముక్కులో దూరుతుంది
గొంతులోకి దిగుతుంది
ఊపిరి తిత్తుల్ని చీల్చుతుంది
కత్తికి
దయుండదు హృదయముండదు
నువ్వనీ లేదు, నేననీ లేదు
పల్లెనీ లేదు, పట్నమనీ లేదు
గొప్ప ప్రజాస్వామ్య లక్షణం
దాని వేగానికి హద్దు లేదు
వాదానికి తావు లేదు
కోవిడ్ కత్తి
చాలా చిన్నది
కంటికి కనిపించదు
‘విషాదమే’ చాలా పేద్డది
‘మృత్యు వైశాల్యం’  మరీ మరీ పెద్దది
వొంట్లోనూ ఇంట్లోనూ ఓపలేనంత
బతుకులో పట్టలేనంత”(వారాల ఆనంద్)

సరిగ్గా ఇలాంటి సమయం లోనే ప్రముఖ కవి డాక్టర్ నందిని సిద్దారెడ్డి    రాసిన మంచి దీర్ఘ కవిత  “అనిమేష”, ఇది ఉపద్రవగాధ కావ్యం.  దాన్ని ఒకటికి రెండు సార్లు చదివాను.

ఆశ్చర్యం ఇవ్వాళ లోకమంతా మాటలో, చూపులో,  చేతలో, ఆలోచనలో, మనసులో, మమతలో హ్రస్వమవుతున్న వేళ సిధారెడ్డి దీర్ఘ కవిత రాసారు. బహుషా తన ఆవేదనకు, తన ఉద్వేగానికీ, తనను తాను వ్యక్తీకరించడానికి సరిపోయే కాన్వాస్ కోసం దీర్ఘ కవితను ఎంచుకున్నారాయన. ప్రపంచాన్ని కోవిడ్19 కుదిపేసినవేళ సిధారెడ్డి మనిషిగా కవిగా పడ్డ వేదన అక్షర  రూపం దాల్చిన కావ్యం ఇది. 

ఒక చోట   Bertolt Brecht says “ Will there be singing in bad times? Yes, singing about dark times”. అంటాడు. అంతే కాదు ఇంకో చోట  
James Joyce రచయితల గురించి ఇట్లా  అంటాడు “ Squeeze us , we are olives”. అంటే దుఃఖ కాలంలో సృజన కారులు ఎంతగా వేదన చెందుతారో ఎంత దుఖంతో తమను తాము  వ్యక్తంచేస్తారో మనకు అర్థం అవుతుంది. అందుకే  సిధారెడ్డి  తన అనిమేష కావ్యంలో “ఎక్కడో ఎక్కడెక్కడో లోలోన కలుక్కుమంటున్న  కన్నీటి స్థితి, దుస్థితి.

ఎన్ని దృశ్యాలో ఎన్ని దుఖాలో,
ఎన్నెన్ని భయాలో, అనుమానాలో, ఆలోచనలో  కుదుపుతుంటే అవన్నీ పదాల్లోకి వొంపుదామని... ఈ కావ్యం” అన్నాడు.  

అన్నట్టు గానే ‘అనిమేష’ ఆద్యంతం ఒక వూపులో  గాధలు గాధలుగా సాగింది.

‘నిశ్శబ్దం నివ్వెర పోయింది
సముద్రం సరాయించింది
అరచేతి స్వర్గం హఠాత్తుగా కూలి పోయింది.. ‘అంటూ ఆరంభమయి 19 గాధలుగా  ఆవిష్క్రుతమయింది

సిధారెడ్డి తత్వగాధలో ఇట్లా అంటాడు

‘కాలం మాయాజాలం
కరుణ ఒక సారి
కఠినం ఒక సారి
అంతు బట్ట నిది కాలం..’ అంటాడు
అంతే గాదు
‘గాలి లేనిదే దీపం వెలగదు
గాలి పెరిగితే దీపం మిగలదు’ అని కూడా అంటాడు.
ఇట్లా అనిమేష కావ్యం సాగుతూ సాగుతూ
‘బతుకు
బతికించు
బతకనివ్వు’ అంటుంది.

ఆనిమేష కావ్యం దుఃఖ కాలం గురించి దుర్మార్గ కాలం గురించి ఒక కవి, ఒక మనిషి పడ్డ వేదనను  ఆవిష్కరించింది.  మంచి దీర్ఘ కవితను రాసినందుకు  మిత్రుడు సిధారెడ్డికి అభినందనలు. నాకు చదివే  అవకాశం  కల్పించినందుకు ధన్యవాదాలు.

అనిమేష చదివింతర్వాత ఈ నాలుగు మాటలు  పంచుకోవాలినిపించింది. వీలు చేసుకుని మీరూ  చదవండి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios