Asianet News TeluguAsianet News Telugu

తెలుగు సాహిత్యంలోని స్వీయ చరిత్రలు - ఒక పరిచయం

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం  ఆప్కారీ సూర్య ప్రకాశ్  “తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు” అందిస్తున్నారు వారాల ఆనంద్. 

Varala Anand writes a book of Apkari Suryapkash auto biographies in Telugu
Author
Hyderabad, First Published Nov 8, 2021, 2:12 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

A biography is an account of a person’s life, An autobiography is an account of one’s own life. కానీ రెంటి నడుమా తేడాలున్నాయి. ఒకరి జీవిత చరిత్రను మరొకరు తెలుసుకుని రాస్తే అది జీవిత చరిత్ర, తన చరిత్రను తానే రాస్తే అది స్వీయచరిత్ర లేదా ఆత్మకథ.

ఆత్మకథలు ఎప్పుడయితే భేషజాలు లేకుండా నిజాయితీగా శ్వేత పత్రాలుగా రాస్తారో అవి గొప్ప ప్రేరణ నిస్తాయి. ఒక్కోసారి ఓ ఆత్మ కథ పాఠకుడి జీవితాన్నే మార్చి వేస్తుంది. The Autobiography of Benjamin Franklin by Benjamin Franklin, Long Walk to Freedom by Nelson Mandela, The Story of My Experiments with Truth by Mahatma Gandhi, Autobiography of Mark Twain, Dreams from my Father by Barack Obama లాంటి అనేక ఆత్మకథలు ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించాయి.  లక్షలాది మంది జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపించాయి.(నిజానికి ఇవి మచ్చుకు కొన్నే) సాహిత్యంలో ఈ ఆత్మకథ ఒక విశిష్ట ప్రక్రియ. అలాంటి గొప్ప ప్రభావవంతమయిన ఆత్మకథలు తెలుగులోనూ అనేకం వెలువడ్డాయి. తెలుగు సాహిత్యంలో వచ్చిన ఆత్మకథల్లోంచి 11 గ్రంధాల్ని ఎంచుకుని  ప్రముఖ కవి, వక్త  ఆప్కారి సూర్యప్రకాశ్ రాసిన పుస్తకమిది.

కాలం వేగంగా పరుగెడుతున్నదని అందరూ అంటూ వుంటారు కానీ, నిజానికి కాల వేగం ఎప్పటిలాగే వుంది.  మనిషే తన నడకను పరుగుగా చేసుకుని, పరిపరి విధాల తన ఉనికికే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నాడు. దానితో సమయం లేదనే స్థితికి వచ్చాడు. ఈ పరిస్థితులలో ఆత్మ కథల్ని చదివే తీరిక సన్నగిల్లి సమయం లేని స్థితిలో ఆప్కారీ సూర్య ప్రకాశ్ ‘తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు’ అన్న పుస్తకాన్ని రాసారు. ఇందులో ఆయా ఆత్మకథలని స్థూలంగా పరిచయం చేసారు.

అంతేకాదు ఈ పుస్తకాన్ని నిత్య అధ్యయనశీలి, రచయిత, ప్రచురణకర్త నిజామాబాద్ వేదికగా అనేక దశాబ్దాలుగా సాంస్కృతిక రంగంలో కృషి చేస్తున్న పెద్దలు శ్రీ మేకా రామస్వామి గారికి అంకితమిచ్చారు. రామస్వామి గారు తన 84 సంవత్సరాల వయసులో కూడా సాహిత్య సాంస్కృతిక రంగంలో పనిచేస్తూ ఎందరికో స్పూర్తిగా వున్నారు . సుమారు దశాబ్ద కాలంగా ఆయన్ని దగ్గరిగా పరిశీలిస్తున్న నాకు నిజంగా ఆయన దీక్షా దక్షత ఆశ్చర్యపరుస్తుంది.  క్లాస్సిక్ ఫిలిం క్లబ్ పేర నిజామాబాద్ వాసులకు అర్థవంతమయిన సినిమాల్ని కూడా ఆయన పరిచయం చేస్తున్నారు.( ఆయన గురించి మరోసారి వివరంగా రాస్తాను).

ఇక ఆప్కారీ సూర్య ప్రకాశ్  అనగానే ఎప్పుడో  1976-77  ప్రాంతంలో వేములవాడలో నటరాజ  కళానికేతన్ నిర్వహించిన కవి సమ్మేలనంలో మొదటి సారి ఆయాన్ని చూసిన గుర్తు. అప్పటినుండి సి.నారాయణ రెడ్డి ప్రభావంలో కవిత్వం రాయడం గమనిస్తూనే వున్నాను. అంతేకాదు మంచి సినిమా గురించి ఆయనకున్న ప్రేమా, ఆసక్తి అభినందనీయమయింది.

‘తెలుగు సాహిత్యంలో ఆత్మకథలు’ లో  ఆప్కారీ సూర్య ప్రకాశ్ మొదటగా కందుకూరి  వీరేశలింగం గారి “స్వీయ చరిత్రము” ను పరిచయం చేసారు.  గొప్పవాడెప్పుడూ ఒంటరిగానే పోరాటం చేస్తాడని ఆ తర్వాత అనేక మంది అనుసరిస్తారని వీరేశలింగం చరిత్రను పరిచయం చేసారు. తర్వాత ఏనుగుల వీరాస్వామి గారి “ కాశీ యాత్ర” తెలుగు వారి యాత్రా చరిత్రలలో తలమానిక మయింది అంటారు. చిలకమర్తి వారి “స్వీయ చరిత్రము”ను పరిచయంచేస్తూ సగం జీవితం అంధత్వంలో గడిపిన లక్ష్మీ నరసింహం ఒక్క చేత్తో ఇన్ని పనులు చక్క బెట్టడం అనుపమానమయింది అంటారు. తెలుగు భాషను ఒడిసి పట్టి నుడికారాన్ని తెలుగు సాహిత్యంలో నిలబెట్టిన శ్రీపాద ‘అనుభవాలూ జ్ఞాపకాలూ’ ను పరిచయంచేస్తారు. గుండెలో కలం ముంచి కవనం అల్లిన వారు దాశరథి కృష్ణమాచార్య అంటూ ఆయన “యాత్రా స్మృతి” ని, దాశరథి రంగాచార్య గారి “ జీవన యానం” పుస్తకాల్ని విపులంగా పరిచయంచేశారు. సామల సదాశివ గారి “యాది” గురించి రాస్తూ ఒక ముగింపు లేని పాట అన్నారు. సంజీవదేవ్ గారి “తుమ్మపూడి” గురించి రాస్తూ సంజీవదేవ్ అందమయిన గాలిపఠం అన్నారు.

ఇంకా మామిడిపూడి వెంకట రంగయ్య గారి “మారుతున్న సమాజం- నా జ్ఞాపకాలు”, తిరుమల రామచంద్ర గారి “ హంపీ నుంచి హరప్పా దాకా”, ముళ్ళపూడి “కోతి కొమ్మచ్చి”ల గురించీ రాసారు.  ఇట్లా ఆత్మకథల విహంగ వీక్షణ పరిచయాలతో పాటు ఆయా రచయితల స్థూల వివరాలూ ఇందులో క్రోడీకరించారు.

క్రియేటివ్ లింక్స్ తాళ్ళ శ్రీకాంత్, ప్రసాద్ కొమ్మూరిల సంపాదకత్వంలో వెలువడ్డ ఈ పుస్తకం చదివితే మూల ఆత్మ కథల్ని చదవాలనే ఆసక్తి ప్రేరణ కలుగుతుంది. ఆ మేరకు విజయవంత మయిన, చాలామంచి ప్రయత్నమిది. పెద్దలు శ్రీ ఆప్కారీ సూర్య ప్రకాశ్ గారికి అభినందనలు.

Follow Us:
Download App:
  • android
  • ios