రాయికి కూడా ప్రాణమొచ్చి 
కదిలి ఎగిరిపోయింది
అలలకు కాళ్లొచ్చి 
వొడ్డుకు చేరాయి
కండరాలు ఎదిగి 
వేదాల్ని పఠించాయి
మెదడు పెట్టిన గోలకు 
ఏనుగులు బతుక్కి బాకా వూదాయి
వర్షమూ మెరుపులూ 
వెనక ముఖం పట్టాయి
అంతా ముగిసింతర్వాత 
ఓ దుఖం తలెత్తింది
ఎందుకని 
అడిగింది ఆకాశం
నేనెవర్ని 
అని అడిగింది ఇసుక
సముద్రం బిగ్గరగా నవ్వేసింది .

 ఇంగ్లీష్: టి.ఎస్.దక్షిణా మూర్తి 
తెలుగు: వారాల ఆనంద్