వారాల ఆనంద్ తెలుగు కవిత: బాధ
బాధది బహుదారి . చదలు పట్టినట్టు తొలిచేస్తుంది అంటున్నారు తన కవితలో వారాల ఆనంద్.
బాధ
ఎగిసిన ఉప్పెన
వినిపించదు
నిండా ముంచెత్తుతుంది
...
బాధ
ఉప్పొంగిన కెరటం
ఎగిసి దూసుకొస్తుంది
అలిసి విరమిస్తుంది
...
బాధ
ఎలుగెత్తిన మౌన రాగం
పెదాలు కదలవు గొంతు పెగలదు
లోన తీగలు తెగుతాయి
...
బాధ
మాయదారి మోసకారి
దానిది బహుదారి
నిశబ్ద రహదారి
...
బాధకు
భాష తెలీదు మౌనాన్ని కప్పుకుని
మాటల్ని మనసు కడలి లో దాచేసి
చదలు పట్టినట్టు తొలిచేస్తుంది