Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ తెలుగు కథా రచయిత డి. వెంకట్రామయ్య మృతి

ప్రముఖ తెలుగు కథా రచయిత డి. వెంకట్రామయ్య మరణించారు. తెలుగు కథా సాహిత్యంలో ఆయనకు విశేషమైన స్థానం ఉంది. ఆకాశవాణి కేంద్రంలో ఆయన ప్రయోక్తగానే కాకుండా వివిధ స్థాయిల్లో పనిచేశారు.

Telugu short story writer D Venkatramaiah passes away
Author
Hyderabad, First Published Jan 13, 2020, 9:43 PM IST

హైదరాబాద్: ప్రముఖ తెలుగు కథా రచయిత డి. వెంకట్రామయ్య ఇక లేరు. ఆయన సోమవారంనాడు తుది శ్వాస విడిచారు. తెలుగు కథా సాహిత్యంలో ఆయనకు విశేషమైన, విశిష్టమైన స్థానం ఉంది. 

డి.వెంకట్రామయ్య  పూర్తి పేరు దివి వెంకట్రామయ్య. ఆయన ఆకాశవాణి కళాకారుడు. ఆయన రేడియో నాటక రచయితగా, ప్రయోక్తగా, నటుడిగా, కార్యక్రమ నిర్వాహకుడిగా వ్యాఖ్యాతగా పేరు గడించాడు. 

డి. వెంకట్రామయ్య 40కి పైగా కథలు రాశారు. అయితే, ఆయన ఎందుకో తర్వాతి కాలంలో కథలు రాయడం మానేశారు. ఆయన మృతిపై సాహితీలోకం దిగ్భ్రాంతికి గురైంది.

Follow Us:
Download App:
  • android
  • ios