Asianet News TeluguAsianet News Telugu

యోగిబాబు ఎన్ తెలుగు కవిత; కొరోనా .. కుచ్ కరోనా!!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తూ ప్రాణాంతకంగా మారిన స్థితిలో తెలుగు కవులు విశేషంగా ప్రతిస్పందిస్తున్నారు. అదే అంశంపై యోగిబాబు ఎన్ ఓ కవిత రాశారు.

Telugu Literature: Yogibabu N Telugu poem on Coronavirus
Author
Hyderabad, First Published Apr 9, 2020, 1:56 PM IST

ప్రకృతి ధర్మాన్ని పక్కకు నెట్టి మనిషి కొరోనాను తెచ్చిండు 
తన సమతుల్యత కొరకు అది మనిషికి మరణ శాసనం రాసింది 
మరి, 
ఈ మరణదండన యమకొరోనా ఎవ్వరికెయ్యాలె ...
సమాజానికి పట్టిన ఈ పీడ కు కారకులయినందరికీ -
కుల,మత,ప్రాంత,వర్గ రహితంగా -
రాజకీయ అరాచక వాదులకు, 
అసాంఘీక శక్తులకు,
అవినీతి పరులకు,
అక్రమార్కులకు,
మతోన్మాధ శక్తులకు ....
 "మనిషి" గా బతుకని,బతుకనివ్వని ప్రతీ ఆటంకవాధికీ - ఈ కొరోనా కాటెయ్యాల్సిందే!
ఇదే సరయిన సమయం ...
మానవ సమాజాన్ని వడపోసేందుకు,
పకృతి ప్రకోపానికి కారకులైన ఈ చెత్తను తగలేసేందుకు,
స్వార్ధ పూరిత,యాంత్రిక,అహంకారపు మనుషులను ...
శాస్త్రీయ ఆలోచనే లేని మిధ్యా మేధావులను..
సాంకేతికతను నిత్యం వాడుతూ - నాగరిక ప్రపంచంలో బతికే అనాగరిక మూర్ఖులను ...
వడగట్టి వేరు చేసి - పిప్పిని పాతాళంలోకి 
తొక్కి పాతరేసేందుకు - కొరోన ..కుచ్ కరోనా!!

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి:https://telugu.asianetnews.com/topic/literature

Follow Us:
Download App:
  • android
  • ios