తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్పానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవనపల్లి వీణావాణి రాసిన విభాజిని అనే కవితను ఏషియానెట్ న్యూస్ తెలుగు పాఠకుల కోసం అందిస్తున్నాం.
గుంపులు గుంపులుగా
పద ముద్రలు
భుజం భుజం ఒరుసుకుంటూ
జత కలిసిన అడవి బిడ్డల ఆటలాగా
చుక్క చుక్క కలిసి
గీసుకునే ముగ్గు లాగా
కథ మొదలవుతుంది
Add Asianetnews Telugu as a Preferred Source

పెనం వేడెక్కిన వేళకి
తల మీదెక్కి
చుక్కలు తెంపుకునే
చేతులు పుడతాయి
నిలువూ అడ్డమూ
చదరాలుగా విడిపోతాం
నలుపూ తెలుపూ గళ్లలో
పెట్టబడతాం
నేయక ముందే
గుడ్డకు మాసిక పడుతుంది
అనుభవాల ఘర్షణలో
మాటల నుసి రాలుతుంది
పొడి పొడి చూపులకు
ఎడారి ఇసుక
మేట వేస్తుంది
నశించిన అనుభవం నుంచి
పైకి లేచిన చేయి
నడిచే తోవ మధ్య
విభాజినిగా నిలబడుతుంది
తెలుగు సాహిత్యం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature
