దాసరి మోహన్ తెలుగు కవిత: వర్చువల్ హాపినేస్....

స్మార్ట్ ఫోన్ల ఉచ్చులో  ఎవరికి వారు తమ తమ సొంత ఇంటిలోనే తప్పిపోయిన దృశ్యాన్ని దాసరి మోహన్ తన కవిత 'వర్చువల్   హాపినేస్'   లో కళ్ళముందు ఎలా  ఆవిష్కరించారో చదవండి.

Telugu literature: Dasari Mohan telugu poem vartual happiness

నీతి మాటల మూటలు
మొబైల్ డాటా నింపేసింది
జవహర్ డంపింగ్ యార్డ్ సరిపోదేమో

అంతా అన్ లైన్ లో నే
ఆయుధాలు అయిన  మొబైల్స్
ఛార్జింగ్  చేసుకోవడం  ఇక వంతుల వారిగా

కట్టి పడేసినా
కవి సమ్మేళనం ఆగ డం లేదు
జూమ్ దేవో భవ
కార్బన్ మోనాక్సైడ్ బాధ తప్పింది...

ఒక నెట్ వుంటే చాలు
వైరస్ లు వంద వచ్చినా
కరిగి పారేస్తా రోజుల్ని
మున్సిపాలిటీ కుళాయి నీటిలా...

ఒకరు రిపీట్ సీరియల్ లో
మరొకరు టిక్ టాక్ వుచ్చులో
సొంత ఇంటిలోనే తప్పిపోయారు అందరూ..

వలపులన్నీ   లాంగ్ లీవ్
స్మాల్ స్క్రీన్ మీదే సిలిపి తనమంతా
వర్చువల్ హాపినెస్ ఆవరించింది అంతా

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios