తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వం విశిష్టమైంది. బెల్లండకొండ సంపత్ కుమార్ రాసిన నమ్మకం అనే కవితను మీ కోసం అందిస్తున్నాం.

పుట్టిన గూడు
పెరిగిన దిక్కు
విడిచి
వలస పక్షి
తిరి గొస్తానని 
రెక్కలిచ్చింది

కాలం వేరు చేస్తున్నా
రాలు ఆకు
రెమ్మకు చిగురిస్తానని
పచ్చిగ మాటిచ్చింది

చినుకు కెంత విశ్వాసమో
కాలుతున్న పెనం మీద
బొట్టు ఓడుతున్నదైనా
ఆకాశం చేరుతున్నది
మట్టి తో జత కడుతున్నది
పరిమళిస్తున్నది
యుగాలుగా 
గూన ధార సంగీతమై
గండ్ర శిలను ద్రవింప జేస్తున్న ది

జడమైనాకానివ్వు
జీవమైనాకానివ్వు
 లోన తడువాలె
 ముద్దకావాలె
మనుగడకు
అస్తిత్వం ఎంతనో
వమ్ముకానినమ్మకం
అంతఅవసరం
నమ్మకమేలేన్నాడు
శ్వాసకు
ఊపిరందదు.

మరింత సాహిత్యం కోసం: https://telugu.asianetnews.com/literature