బెల్లంకొండ సంపత్ కుమార్ కవిత: అ.. అమ్మ
తెలుగు సాహిత్యంలో కవిత్వానికి విశిష్టమైన స్థానం ఉంది. బెల్లంకొండ సంపత్ కుమార్ రాసిన కవిత ఏషియానెట్ న్యూస్ తెలుగు పాఠకుల కోసం అందిస్తున్నారు.
మట్టికి కండ్లిస్తే గాని
ఆకాశం లోతు తెలువదు
మింటి పై ఆవిరులయి
తొంగి చూడాలే గాని
మట్టి గంధం అంటదు
హృదయం
అనంతమైవిప్పారాలే తప్ప
అమ్మ అంతు పట్టదు
మనసు పాలతల్లి
లోగిలి
అక్షర కృతిగ మలచి
లోకాన్ని ఒలలాడించే
శాస్త్రజ్ఞురాలు
తొలి జ్ఞానమూలం
స్పర్శ తప్ప
ఎరుక తెలువన్నాడు
అపరిచితులే కావచ్చు
అమ్మ పేగు అద్దకం
పేగు చనుబాల వాసన
అంతర్ బహిర్ బంధ రహస్యాలు
దేవతలు అమృతం తాగారేమో
అమరులయ్యారేమో
అమ్మ ఆయువిచ్చి
అమృతమయం చేస్తున్నది
ఒడి నిండా
ముదురుకునే
అభయహస్తం
నిముషం కనబడనంతనే
ఓరకంట వెతుక్కుంటుంది
చనువు కోవెల
వెచ్చని ఊపిరులు తాకితే చాలు
ఆకలి దప్పులు
బాధల బంధీలు
శాంతిస్తయి
సహజమైన ప్రకృతి
జ్వాల
వర్తనం
జలధి
గర్జన
జవం జీవం
జగత్తు సర్వం
దేశమేదయితేనేమి
ఏ అంతరాలు లేనిది by
అమ్మ ఒకతే
ఆమెను బాధించటం
స్వయాన నశించటమే.
మరింత సాహిత్యంకోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature