సరిహద్దులను చేరిపేస్తూ
ఆసేతు హిమాచల
జన తరంగ తురంగా
కదన కుతూహలం

విషపు కరోనా 
విస్తరణ ధిక్కరిస్తూ
జనకవాతు యుద్ధగీతం

యుద్ధసారధులకు
జన జేజేల సంకల్ప 
చప్పట్ల సంగీతం

నిర్మలమైన నీలాకాశం
పక్షుల కూజితాల
వసంతోత్సవం .
ప్రకృతి పరవశంతో 
తానావిర్భవించిన నాటి 
విమల వేడుకల కోలాహలం

భయాన్ని జయిస్తూ 
ద్వేషాన్ని దహిస్తూ
వేరుగా ఉండడంలో
ఏకాంతాన్ని అనుభవిస్తూ
భీభత్స,జ్వరామరణాలను 
అధిగమిస్తూ పునరుద్భవ జీవనం

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature