దెబ్బలు లేవు బొబ్బలు లేవు
పెయ్యంత జర కొట్టి పండవెట్టి నట్టు

ఎన్ని నీళ్లు తాగినా ఆరనట్టుగా దూప
నోరంతా ఎండుక పోయిన కంచం

మనసంతా బుగులు బుగులు పొగలు
లోపల సూస్తే అంతా కుల్లం కుల్ల

కప్పుకొని పంటే లేవ బుద్ధి అవుడు
లేశి కూసుంటే పండ బుద్ధి అవుడు

కొంచెం కొంచెం జరం కొట్టినట్టు కాక
మాత్ర పడంగనే  సల్ల చెమటలు

సై లేని నాలిక, నోట్లెకు  ఏం సైసది
గావురం గాపురం మాటలకైతే 
ముద్ద మా కడుపుల పడుతది

ఇదంతా కోవ్యాగ్జిన్  వ్యాక్సిన్ కోపాగ్ని 
ఒక్క రోజు దేహం అతలాకుతలం
కోవిడ్ గాడు ఓడి పోయే యుద్ధం మొదలైంది.