Asianet News TeluguAsianet News Telugu

దాసరాజు రామారావు పట్టుకుచ్చుల పువ్వు

రామారావు గారి మొదటి పుస్తకం గోరుకొయ్యలు(2001)లో ప్రచురితం. గోరు కొయ్యల అంటే చుక్కల వరుస. రైతు కాలమానిని, రైతు దినచర్య తెలిపే దిక్సూచి. ‘పట్టు కుచ్చుల పువ్వు ‘2012లో ప్రచురితం.

Siddenki yadagiri reviews Dasaraju Rao Pattukuchula Puvvu poetry
Author
Hyderabad, First Published Sep 23, 2019, 3:54 PM IST

పట్టుకుచ్చుల పువ్వుకు చాలా ప్రత్యేకత ఉన్నట్లే దాసరాజు రామారావు గారి అక్షరాల పొందిక ఉంటుంది. చూడ్డాటానికి జారి జారి పోతున్నట్లే మన మనసుల్లోకి జారి మనల్ని అక్షరాలతో నూరి మనపై విసిరి మనల్ని తన శైలి కౌగిట్లో పట్టుకుంటాడు. మనకూ పట్టు నేర్పుతాడు.

రామారావు గారి మొదటి పుస్తకం గోరుకొయ్యలు(2001)లో ప్రచురితం. గోరు కొయ్యల అంటే చుక్కల వరుస. రైతు కాలమానిని, రైతు దినచర్య తెలిపే దిక్సూచి. ‘పట్టు కుచ్చుల పువ్వు ‘2012లో ప్రచురితం. రెండూ మరసం(మంజీర రచయిత సంఘం) నుండి తీసినవే. దాసరాజు గారి ప్రత్యేకత అక్షరానికి అచరణకి ఉన్న సంబంధం అతనిలో కనపడుతుంది.

దాసరాజు గారు అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించే ఉపాధ్యాయుడు. విలువల్ని బోధించే నిలువెత్తు గని. అంతకంటే నిఖార్సైన తెలంగాణవాది. గిరిగీసుకున్న లక్ష్య సాధనలో సాక్షిగా నిలబడుతడు. ‘వృత్తికి అంకితమయ్యే ఉపాధ్యాయుడు నేడు జాతికి అవసరము’ అన్న గాంధీ గారి మాటల్ని నిజం చేస్తూ ఉత్తమ ఉపాద్యాయునిగా ఎంపిక చేసినపుడు సన్మానాలు వద్దు ప్రత్యేక రాష్ట్రమే ముద్దు అని ప్రకటించి మాటమీద నిలబడి ఎందరికో ఆదర్షంగా నిబడ్డడు.

ప్రత్యేక రాష్ట్ర సాధనలో బలి పీఠమెక్కిన అమరుల్ని తలుచుకొని చేసే పని సఫలం కాకపోతే విఫలం అయినట్లుగా భావించకూడదు. వీరుల్ని స్మరిస్తూ ఇనుపకంచే తీసి  అటాక్‌ చేసినోడివి/నిరాశ సందేశం ఎట్లా ఇవ్వగలిగితివి అని కలత చెందుతాడు. తెలంగాణ ఎవరికోసం? ఎందుకోసం తెంగాణ అందరు అగమయి అవుతున్నోల్లను చూసి బతికి సాధించాలని బోధ పోస్తడు. నీకన్న/ వాళ్ళకు/ నీ తెలంగాణకు/నిర్జీవపు స్తూపంగా మిగలటం/ ఎవరు కోరుకున్నరు తమ్మి’ అని ఉద్యమార్పనం మంచిది కాదంటడు. ఆబాధ నుంచి తేరుకోవాలని ఓటమి గెలుపుకు మెట్టుగా చేసుకోవాని కోరుతడు’ ఉద్యమ కారుడా/ పురోగామి పథికుడా/ బెంగటీలకు/......./మరిచినవా యోధుడా/ మానవస్త్రాన్ని’ కలలో కూడా అనుకున్న లక్ష్యాన్ని మరిచిపోకూడదు అవనతన అనేది జాతీయ జెండాకు మాత్రమే వాడే పదాన్ని ఒరిగిన వీరులకు ఆపాదించి శ్లాఘించిన తీరు ఇందులో మనకు స్పూరిస్తుంది. అనుకున్న పని సక్సెస్‌ కావాలనుకున్నపుడు పనిమీద ద్యానం చేయి ‘నీ చెయిని దానం చెయ్యి/ పిడిగా అమర్చుకొని/ కొడవలి ఆయుధంగా మారనీ’ అని అంటుంటే మనకు భగత్‌ సింగ్‌ మాటు’ మీరు రక్తాన్నివ్వండి నేను మీకు స్వాతంత్య్రాన్నిస్త అనే మాట గుర్తు రాక మానదు. పొరాటంలో మరో మార్గమే లేదనీ జీవిత కాలంలో రాజీలేని పోరాటమం చేయాలనీ’ సర్వ ప్రపంచాన్ని నిలబెట్టి/ మాట్లాడు లేదా కొట్లాడు/ సర్వశక్తుల్ని ఒడ్డి’ అని ధైర్యం నూరిపోస్తాడు.

అరువై ఏల్లనుంచీ మేమే అభివృద్ధి చేసినమనీ, తెలంగాణ యాసని ఎక్కిరిస్తున్న ఆంధ్రొల్లనీ ప్రశిస్తూ’ గాలి నీళ్ళు  ఎక్కడియి బిడ్డా/ శాని భాష/ శాని శాని భాష’ అని గొప్పగా అని హేళన చేస్తడు రామారావు గారు.

ఇప్పుడు మన సి.ఎం అంటున్న ఆట ముగియలేదని మాటని’ పాము  సావదు/ కర్ర ఇరగదు/విషాలత కుతైమై/ బాల్‌ ఏ గోల్‌ చేయకుండానే ఆట క్షణాన్నీ అవ క్షణాలే. ‘అని అన్నడే కవిత్వీకరించిండు.

కవి మనసునీ ప్రేమించిండు ఎదుటి వారిలో మనిషి తనాన్ని అడ్డుకున్నడు. మనిషి మనిషి లాగ బ్రతుకాలంటడు. న్యాయం, ధర్మం కోల్పోవద్దనీ మనిషీ... సరిగ్గా నువ్వు బయట పడే సమయమిదే వీళ్ళంఋ అందుకుంటావో ప్రశ్నించని నేరస్తునివై మిగుతావో కాయిన్‌ చిత్తు బొమ్మ న్యాయం వైపే ఉండాలి మరి. ‘వేడుకుంటాడు రామారావు నీవేదో’ నిర్ణయం చేయ్‌.’ మనసు తనాన్ని నిర్దేశిస్తడు.
     
పెరిగిన ఊరన్న ఊరిలోని చెరువన్నా ఎంతో అభిమానం. చెరువుతోనే జీవితం. ఆ చెరువుతోనే బ్రతుకుదెరువు. ఆటా పాట అన్ని కగలిసిన జీవితమే పరువు. చెరువుని చూసిన కవికి అప్పటి చెరువుకి ఇప్పటి చెరువుకి ఎంత తేడానో ప్రపంచీకరణలో ఎట్లా మనిషితో పాటు మాయమైపోతున్నయని కిన్లే వాటర్‌ బాటిల్‌ని చూస్తున్నావా నాకేమనిపిస్తుందో చెప్పనా బంగారు పంజరంలో/బందీ అయిన మన వూరి చెరువులా లేదు. ‘వాళ్ళూరి చెరువునే కాదు వ్యాపారంలో అంతర్థానమవుతున్న చెరువుల్ని మనకు చూపుతడు.
      
ఉన్న ఊరిని విడిచి బ్రతుకు తెరువు వేటలో మళ్లీ ఆ ఊరికి వెళ్ళక పోవటంతలుచుకొని తన జీవితాన్ని నెమరు వేసుకుంటూ నేనిపుడూ ఆ ఊరికి పోతలేను /ఆ ఊరికి / ఆ ఇంటికి తాళం కప్ప వేలాడుతున్నది. అని కుమిలిపోతుంటడు. జిల్లామీది అభిమానంతో చారిత్రక కొండాపురం మ్యూజియం సందర్శించిన విదం మనకు దీవెనార్తి పలకడానికి చెయ్యి ఎత్తి పట్టే ఉంచి/ గంటం చేసే గుణాడ్యుడు ఆలపిస్తుంట్లే ఉంది అని బృహత్కతకు నెలవాలమైన నేను స్మరిస్తడు. బస్సు ప్రయాణం చేస్తూ మూగవాన్ని చూసి కరిగిపోయె మానవత్వమనే మనసు రామారావు గారికుంది. బాగోపాల్‌ సార్‌ చనిపోయినపుడూ ఏడువని పెన్ను లేదు. దాసరాజుఅందరిలా ఏడువలేదు. మిమ్మల్ని లాక్కెళ్లిన మృత్యువుపై/కసిదీర కేసుపెడ్తం/మీరు వాదించలే వింటున్నారా సార్‌’ అని మన మీద పడి గ్లొల్లున ఏడుస్తూ ఏడిపిస్తడు పాఠకున్ని ఈ  పుస్తకానికి ముందు మాట రాసిన వరవరరావు గారు ‘‘కవితను వస్తుకేంద్రంగా చెప్పాలనుకున్నపుడు మనిషిలోని మనిషి తనం పరాయికరన చెందుతున్న ఆవేదన. మనిషిని ఆవిష్కరించాలనుకున్న ఆవేదన కవిలో కనిపిస్తాయి. శిల్ప పరంగా భావశబలత సుందర స్వప్నాలను చూడగ ఊహ పరుచుకొని ఉంది. ఈ కవిలో బలహీనమైన పల్చనైన వ్యక్తీకరణలు లేవనికావు కావు ఒక్కటయ్యే సందర్బం. కవుల్నీ, పాఠకుల్ని, ఆత్మీయుల్ని ఏకం చేస్తుంది.’’

అమరవీరులను కళ్ళకు అద్దుకొని తలకెత్తుకొని వాల్లు నడిచిన తొవ్వలో నడుస్తననీ నువ్వు విడిచివెళ్లిన తొవ్వ అసంపూర్తి వాక్యంలా ఉన్నది అంటాడు. పాఠకులతో సంబోధిస్తూ ‘రా/నాతో/కలిసి నాలుగు అడుగులు వేయ్‌’ అని ప్రశ్నిస్తున్నాడు మహా వాక్కుగా మంచికోసం మనమూ రామరాజు గారితో జత కట్టాల్సిందే మరి.    

Siddenki yadagiri reviews Dasaraju Rao Pattukuchula Puvvu poetry        

 - డాక్టర్ సిద్దెంకి యాదగిరి

నోట్: కవితలు, కథలు, సాహితీ విమర్శనా వ్యాసాలు, పుస్తక సమీక్షలు పంపించాల్సిందిగా కోరుతున్నాం. వాటిని వీలు వెంబడి ఇక్కడ ప్రచురిస్తాం. సాహితీవేత్తలు ఈ విభాగాన్ని వాడుకోవడానికి వీలు కల్పిస్తూ తమ రచనలను ఈమెయిల్ ద్వారా పంపించాలని కోరుతున్నాం. మీ ఫోటో పంపించడం మరిచిపోకండి. email: pratapreddy@asianetnews.in

పుస్తక సమీక్షలు

శైలజ బండారి... ‘చేతి చివర ఆకాశం’

Follow Us:
Download App:
  • android
  • ios