సీమా ఆజాద్ కవిత: ఐ కాంట్ బ్రీత్

సీమా ఆజాద్ రాసిన ఐ కాంట్ బ్రీత్ అనే హిందీ కవితను ప్రముఖ రచయిత్రి డాక్టర్ గీతాంజలి తెలుగులోకి అనువదించారు. ఆ కవితను తెలుగు సాహిత్య పాఠకుల కోసం అందిస్తున్నాం.

Seema Azad Hindi poem translated by Githanjali into Telugu

నాకు ఊపిరి ఆడటం లేదు.
యుగాలు గడిచిపోయాయి.
ఇంకా నా ఊపిరి తిత్తులకు స్వచ్ఛమైన గాలి అందటం లేదు !
జార్జి ప్లాయిడ్ ..నీవే కాదు మేం కూడా  శ్వాస తీసుకోలేక పోతున్నాము.
వూరి అంచులలోని చిన్న చిన్న వెలివాడలలో.,
నగరాల్లో మాన్ హోల్స్ నుంచి పొంగి పొరలే విషపు గాలులలో.,
యుగ యుగాలుగా 
మనువాదుల మోకాళ్ళ అణిచివేతల కింద అణిగి  పోతున్న మాకు .,జార్జి ప్లాయిడ్... శ్వాస అందటం లేదు!
మేం చాకిరీ చేసే
ఇళ్లల్లోని పెత్థందారుల కింద.,
వంట పొయ్యి పొగల మధ్య.,
వర్ణాశ్రమ ధర్మ గ్రంథాల ముక్కి న కాగితాలలో..
పితృస్వామ్య పు కర్కశ పాదాల కింద
యుగాలుగా నలిగి పోతున్నాము మేం.
మిత్రుడా... జార్జి ప్లాయిడ్.,
నువ్వే కాదు మేమూ శ్వాస తీసుకోలేక పోతున్నాము.
లక్మణు డి పాదాల కింద తొక్కబడ్డ ఆహల్య, రాముడు అంటించిన అగ్నికి బుడిదైన సీతా ఉండిన రామ రాజ్యం నుంచి.,
తరిమి తరిమి నరకబడ్డ దళితులున్న "ఉనా "లోని ప్రజాస్వామ్య రాజ్యం దాకా.,
నీ లాగే జార్జ్....
మా లోని కొందరు ఊపిరాడక చచ్చిపోతే.,
ఇంకొందరు ఊపిరి తీయబడి చంప బడ్డారు.
నీ లాగే .,అచ్చం నీలాగే జార్జ్.!
రోహిత్ వేముల.,ప్రియాంక ఖోట్మాంగే,సురేఖా ఖోట్మాంగే.,
ఇంకా చాలా మంది...అనామకులు 
పొడవైన పేర్ల శృంఖలం ఉందిలే...
వారంతా ..ఈ ఉపిరాడని ఉక్కిరిబిక్కిరి తనం లోనే చనిపోయారు.
ప్రియమైన జార్జి ప్లాయిడ్... కారుణ్యమే లేని ఆ కఠినాత్ములను నువ్వు ఊపిరి కోసం చేతులెత్తి .,
ప్రార్థించి,ప్రార్థించీ.,
ఊపిరి దొరక్క కొస ఊపిరి కూడా వదిలేసి చనిపోవటం చూసిన మాకు కూడా...స్నేహితుడా...ఊపిరి ఆగిపోయేలా ఉంది.
నీకు తెలుసా జార్జ్..నీకులాగే మాకందరికీ కూడా ఒక్కసారి...ఒకేలా అనిపించింది.
"We Cant Breath " అని...
జార్జ్.... జార్జ్... మాకు తాజా శ్వాస కావాలి !
నీ దేశంలో పిడికిళ్ళు ఎత్తిన ప్రజలు...నినాదాలు ఇస్తూ.,
వీధుల్లోకి పోటెత్తారు.
నేస్తమా...అక్కడ వీస్తున్న గాలి తుఫానుగా మారనున్నది.
జార్జ్...
ఆ తూరుపు గాలి కాస్త మా దేశం వైపుకి పంపియ్యవూ...!
 
మూల రచన హిందీలో సీమా ఆజాద్.
తెలుగులో అనువాదం గీతాంజలి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios