నా ఆలోచనల్లోనే కొంత అనుమానం కానీ 
నేస్తమా నువ్వు నిర్దయుడివి కాదు 
కొన్నిసార్లు నీ గురించిన తలంపే లేదు 
జీవితం నిండా ఒత్తిల్లున్నాయి 
నాతో నేను యుధ్ధం చేస్తూనే వున్నాను 
ప్రపంచంతో నిరంతర యుద్ధం సరే సరి 
నన్ను నేను దహించుకుంటూ 
నాలో ఎంత వెలుగుందో చూడాలనుకున్నాను 
నా జీవనయానంలో చీకటి ముసురుకున్నప్పుడు 
నీ జ్ఞాపకమే నాకు స్థిరమయిన తోడు 
వీడ్కోలు సమయంలో చిరునవ్వు 
వియోగంలో ఏదో 'ఆనందం' వున్నట్టు 
పట్టపగలు ఎవరో అడిగారు 'ఓ శ్యామ్' 
వెలుతురున్నదా ? వెలుతురున్నదా? అని 

సింధీ మూలం: నారాయణ్ శ్యామ్ 
ఇంగ్లీష్: ది.కె.మన్శరమని 
తెలుగు: వారాల ఆనంద్