Asianet News TeluguAsianet News Telugu

మునిశేఖర్ కె తెలుగు కవిత: కొత్తేమీ కాదు

నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లిన ప్రభుత్వాన్ని  యువకవి మునిశేఖర్.కె  ఏవిధంగా ప్రశ్నిస్తున్నారో  'కొత్తేమీ కాదు'  కవితలో చదవండి.
 

Muniskahar K Telugu poem, telugu literature
Author
hyderabad, First Published Mar 26, 2021, 2:46 PM IST

త్వరలో యాభైవేల ఉద్యోగాలు
భర్తీ అనంగనే సచ్చినపాణం  
లేసొచ్చినట్లయి
ఆగబేగ పట్నం పైనమైనం

ఇదిగో నోటిఫికేషన్
అదిగో నోటిఫికేషన్ అనంగనే
కన్నవారిని కళ్ళల్లో  పెట్టుకునే
రోజులొచ్చెనని 
తెగసంబురపడ్డాం

ఖాళీల లెక్క తేల్చండని
అధికారులకు ఆదేశాలొస్తే
తప్పిన మా జీవితపు లెక్కను
సరిచేసుకోవచ్చనుకున్నం

కాలంపెట్టే పరీక్షల్లో తప్పిపోవడం,
ఎన్నికలప్పుడే కురిసే ఉత్తుత్తి వరాలజల్లులకు 
తడిసిపోవడం మాకు
కొత్తేమీ కాదు.

గాలి వాగ్దానాలకు ఉబ్బిపోయీ‌...
కొన్నాళ్ళకు  గాలొదిలిన బెలూన్ అవ్వడం 
మాకు అలవాటే....    కానీ,

చిన్నఆశ
మా ఆశలు, ఆశయాలు సర్కారు
పక్షపాతపు కొక్కానికి 
వేలాడుతుంటే చూసి
కనబడని కన్నీళ్ళ మూట‌లు మోస్తున్న
బతుకులు మావి

పోయినంత దూరం తలూపడానికి
మీ పెరట్లో పాలేరులం కాదు !
రేపటి మీ ఉనికిని ప్రశ్నించే నిరుద్యోగులం.

Follow Us:
Download App:
  • android
  • ios