మద్దిరాల సత్యనారాయణ రెడ్డి తెలుగు కవిత: మాస్క్ మంచిదే

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కునే చైతన్యాన్ని కల్పించడానికి తెలుగు కవులు కవిత్వం రాస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్దిరాల సత్యనారాయణ రెడ్డి మాస్క్ మంచిదే కవిత రాశారు.

Maddirala Satyanarayana Reddy Telugu poem on Coronavirus Pandemic

ఇవాళ  వ్యవస్థను మాస్క్ పాలిస్తుంది.
లోకంలో ఎక్కడ చూసినా  దాని మార్క్ కనిపిస్తుంది.
ప్రాణాయామంలో గాలిని బంధించినట్టుగా. మూతులను బంధించి .
లాక్ డౌన్ విధించింది.
మూతులకు గుడ్డ లేకపోతే. 
సమాజం అనుమానపు చూపులతో .
గాయపరిచి అవహేళన చేస్తోంది.
రోడ్డు మీద కనిపించిన. 
చెత్తంతా కడుపులో వెయ్యకుండా .
మోకాలడ్డు పెడుతుంది.
అనవసరమైన మాటలకు అడ్డుకట్ట వేస్తూ .
నిశ్శబ్ద లోకాన్ని సృష్టిస్తూ.
ఎడ్ల మూతులని శిక్కాలు బంధించినట్టుగా. మానవుల నోటిని బిగించింది.
మందిలో సంచరిస్తున్న మనుషులకి .
ఒక రక్షణ కవచంలా ఉండి.
మనోధైర్యాన్ని అందిస్తుంది.
స్వచ్ఛమైన గాలిని అందించే వృక్షంలా .
మానవ దేహాలకు సహాయపడుతుంది.
మాస్క్ లేని ప్రాణం .
గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతుంది.
దారిన పోయే దానయ్య కైనా .
మాస్క్ తప్పనిసరి.
అది ఉంటేనే సమాజం నిన్ను తిరిగనిస్తుంది.
 లేకుంటే చలానా విధిస్తుంది

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios