నా ప్రాంగణం - నా చెట్టు
నా ప్రాంగణం - నా చెట్టు - ఉర్దూ మూలం : జావేద్ అఖ్తర్ - తెలుగు అనువాదం: వారాల ఆనంద్
మా ప్రాంగణం
ఎంతో పెద్దగా మరెంతో విశాలంగా వుండేది
అప్పుడు నేను నా ఆటలన్నీ అందులోనే ఆడేవాణ్ణి
ఆ ప్రాంగణానికి ఎదురుగా
నా కంటే ఎంతో ఎత్తుగా
ఓ చేట్టుండేది
నేను పెద్దవాడినయ్యాక
ఎప్పటికయినా
ఆ చెట్టు చివరి అంచును తాకుతానని
నాకెంతో నమ్మకం వుండేది
ఏళ్ళు గడిచాక
ఇంటికి తిరిగొచ్చి చూస్తే
మా ప్రాంగణం ఎంతో చిన్నగా అనిపించింది
కాని
ప్రాంగణం ఎదురుగా వున్న చెట్టు మాత్రం
అప్పటికంటే మరెంతో పెరిగి పెద్దదయింది
- ఉర్దూ మూలం : జావేద్ అఖ్తర్
తెలుగు అనువాదం: వారాల ఆనంద్