సముద్రంలో‌ బిందువు కాదు...
బిందువులోనే
సముద్రం దాగివుందని !

ఓయ్....
అంత మాటంటావా ?

అనంత విశ్వంలో
అణువులు కాదు...
అణువులోనే
విశ్వం దాగివుందని !

నిన్నే...ఎవరైనా వింటే
ఏమనుకుంటారు !?

ఆకాశంలో
నక్షత్రాలు కాదు....
నక్షత్రాల మధ్యనే
ఆకాశం వుందని !

ఇరుకుగదిలో..
ఒంటరిగా
వ్యాసపీఠం.. 
ముందు కూర్చుని

పుంఖాను పుంఖాలుగా
ఆణిముత్యాలు...
ఒలకబోస్తావెందుకు !?

ఇక లాభం లేదు
బయటికి పోదాం....
జీవితం ముసుగులు తీసేసి
హాయిగా గాలి పీల్చుకుందాం !!