వాస్తవ కథ,
గౌరవప్రదమయిన మాట 

జేసెఫ్ హెల్లర్, ప్రముఖ హాస్య రచయిత 
ఇపుడు లేడు, మరణించాడు 

నేనూ హెల్లర్ షెల్టర్ ఇలాండ్ లో 
ఓ కోటీశ్వరుడిచ్చిన విందులో వున్నాం

జో నీ నవల 'కాచ్-22'
మొత్తం సంపాదించిన దానికంటే 
మన ఆతిథేయి Host నిన్న ఒక్క రోజులో 
సంపాదించి వుంటాడు 

నీకేమనిపిస్తోంది అన్నాన్నేను

నేను పొందిన దాన్ని అతను తన 
జీవిత కాలంలో పొందలేడు అన్నాడు జో
'ఈ భూమ్మీద అంతా గొప్పదేమిటో- అన్నాను

'నాకు సరిపడినంత జ్ఞానం' అన్నాడు జో 

చాలా గొప్ప మాట,

ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో జో .

ఇంగ్లీష్ మూలం :   కుర్ట్ వొన్నేగుట్

 
ఇంగ్లీష్ స్వేచ్ఛాను వాదం : వారాల ఆనంద్