ఇరుగు పొరుగు: రూపి కౌర్ కవితలు

ఇరుగు పొరుగు శీర్షికలో భాగంగా ప్రముఖ కవి వారాల ఆనంద్ రూపీ కౌర్ ఆంగ్ల కవితలను తెలుగులో అందించారు ఆ కవితలను చదవండి

Irugu Porugu: Varala Anand translates Rupi Kaur English poem into Telugu

Irugu Porugu: Varala Anand translates Rupi Kaur English poem into Telugu

అతన్ని ఎట్లా ప్రేమించాలో 
నేర్చుకుంటున్నాను
నన్ను నేను ప్రేమించుకుంటూ 
----------------------- 
*
నాలో నాకిష్టమయింది నీ వాసనే
నువ్వు భూమిలాగా మూలికలాగా తోటలాగా 
మిగతా మా అందరికంటే 
మరింత ఎక్కువ మానవీయంగా 
---------------------------- 
*
ఎవరు నీకేమీ 
తిరిగి ఇవ్వలేరో 
వారికే 
నువ్వు ఇవ్వు 
------------------- 
*
నీకు సరిపడినంతగా 
నువ్వు లేక పోతే
మరెవరికీ సరిపడినంతగా 
వుండలేవు 
----------------------- 
*
ఏదో ఒకచోట 
నీ వెతుకులాటను ఆపాల్సిందే
ఎందుకంటే నువ్వు దాన్ని 
ఒంటరిగా వదిలేయాల్సిందే కదా 
------------------------------ 
*
కొంతమంది మనుషులు 
ఎంత చేదుగా వుంటారంటే
వారితో నువ్వు 
మరింత దయగా వుండాలి 
----------------------- 
*
నువ్వే 
నీ ఆత్మ సహచరుడివి 
--------------------------- 
*
ఈ ప్రపంచం 
నీకెంత దుఖాన్ని ఇస్తుందంటే
నువ్వు దాంట్లోంచి 
బంగారాన్ని తయారు చేస్తావు 
-- అంతకంటే స్వచ్చమయిందేదీ లేదు 

ఇంగ్లీష్: రూపి కౌర్ 
తెలుగు: వారాల ఆనంద్ 

Irugu Porugu: Varala Anand translates Rupi Kaur English poem into Telugu

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios