ఓ నా పలకా 
ఓ నా పెన్సిల్ 
మీరిద్దరూ 
నా లెక్కలన్నీ చేసి పెడితే 
మీకు పాల ఐస్ కొనిపెడతాను
ఒక్కటి కాదు 
ఇద్దరికీ చెరోటి కొనిపెడతాను
ఓ పలకా 
నువ్వు నా లెక్కలు తప్పుగా చేస్తే 
నిన్ను నేలక్కొట్టి పగులగొడతాను
ఓ పెన్సిల్ 
నిన్నయితే 
గట్టిగా గోడకొట్టి విరగ్గొడతాను
ఇదంతా 
నాకు లెక్కలు చేయడం రాక కాదు 
ఇప్పుడు నాకు నిద్రొస్తుందనీ కాదు
ఈ ప్లేట్ల కుప్పల్ని కడిగి పెట్టకపోతే 
ఈ నీళ్ళ డ్రమ్ముల్ని నిండా నింపకపోతే 
వాళ్ళు నన్ను 
పచ్చడి పచ్చడి గా నలగ్గొట్టరూ.....

మలయాళీ మూలం: మోహనకృష్ణన్ కలడి 
ఇంగ్లీష్: వి.ఆర్.అచ్యుతన్ 
తెలుగు: వారాల ఆనంద్