ఇరుగు పొరుగు: రాజస్థానీ కవిత సరే మనమెందుకు ఇలా
ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ రాజస్థానీ కవితను తెలుగులో అందించారు. దాన్ని ఇక్కడ చదవండి.
సరే
మనమెందుకింత
దగ్గరగా నిలబడ్డాము పాముల్లాగా
ఎలుక రంద్రాలే మనకు సరైన నివాసాలు
ఇది నగరం
ఇక్కడ రహదారి అంతం లేకుండా
ప్రవహిస్తుంది
ఎక్కడ చూసినా
గుంపులుగా జనం
మనమంతా వట్టి అస్థిరం గాళ్ళం
ఏ నిర్దాక్షిన్యమయిన
కాలి మడమల కింద నలిగిపోతామో
మనం కలిసికట్టుగా
అప్రమత్తంగా కూడా వుండాలి
గుంపులుగా విడిపోకూడదు
మన నోళ్ళల్లో విషమేదయినా వుంటే
బయటకు ఉమ్మేయద్దు
ఎప్పుడయినా సంచీ నిండి దురదపెడితే
రాళ్ళనయినా కరకరా నమలాలి లేదా
నేలపై పడుకొని మనకు మనమే
గట్టిగా ధైర్యం చెప్పుకోవాలి
సరే
మనమెందుకింత దగ్గరగా
నిలబడ్డాము పాముల్లాగా
ఎలుక రంద్రాలే మనకు సరయిన స్తలాలు.
రాజస్తానీ మూలం : మోహన్ అలోక్
ఇంగ్లీష్: ఐ.కె.శర్మ
తెలుగు: వారాల ఆనంద్