ఉలిక్కి పడి లేచి 
నిశ్శబ్దంగా రాత్రిని అన్ని విధాలుగా 
పరిశీలించాడు
చివరి అభిమానీ 
తనను విడిచి వెళ్ళాడని 
అతనికి తెలిసిపోయింది
వణుకుతూ నిద్రలో 
దుఃఖిస్తున్న ఓ మహిళ ఏడుపును వింటూ 
దాని వెంట పరుగులు పెట్టాడు
ఇక పరుగెత్తలేనప్పుడు 
తనూ ఏడుపును లంకించుకున్నాడు
తాను ఏడవ గలిగినప్పుడు 
‘కవిత’ రాయడానికి 
ఇక వీధి దీపం కింద కూర్చోలేడు .

కన్నడ మూలం: బి.సి.రామచంద్ర శర్మ 
ఇంగ్లిష్ బి.సి.రామచంద్ర శర్మ 
తెలుగు: వారాల ఆనంద్