ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ తెలుగు కవి వారాలా ఆనంద్ సచ్చిదానందన్ వీడ్కోలు కవితను అందించారు. ఆ కవితను చదవండి.

పట్టాల మీద ఆన్చిన తల
పరుగు పరుగున సమీపిస్తున్న రైలు చేసే 
దడ దడ శబ్దాన్ని వింటూ
ఇనుప చక్రాల కింద 
తన గొంతు 
నలిగిపోక ముందు ఆలపించే 
కలలు నిండిన గీతం
మన కవిత్వం .

మూలం: కె. సచ్చిదానందన్ 
తెలుగు: వారాల ఆనంద్