సుతిమెత్తగా కవిత్వం రాసే'హిమజ'మొదటి పుస్తకం ఆకాశమల్లె’కి సుశీల నారాయణ రెడ్డి అవార్డు (2006) , రెండవ కవిత్వ పుస్తకం ‘సంచీలో దీపం’ కి రొట్టమాకు రేవు (2015)అవార్డులు వచ్చాయి. 'మనభూమి'మాస పత్రిక లో 'హిమశకలం' పేరుతో ఓ శీర్షికని సంవత్సర కాలం పాటు నిర్వహించారు
నే లేకుంటే ఇల్లే నడవదని
ఆకాశం విరిగి పడుతుందని
విర్ర వీగిన కాలు
ఒక్క ఎపిడ్యురల్ సూదితో
ఆపరేషన్ బల్ల మీద
అచేతనమవుతుంది
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
నిపుణులైన వడ్రంగి వైద్యుల
రంపపు కోతల్లో లోహపు కీలు
నేర్పుగా కాలిలో ఒదిగిపోయినా
దేహాన్ని దిగ్బంధనం చేసిన
ప్లాస్టిక్ తీగల మధ్య
విదేశీ భాగాన్ని బుజ్జగించడం
అంత తేలికేమీ కాదు
ఆసుపత్రి విడిదిలో
కఠిన కసరత్తులు, ఫిజియోలు
నొప్పిని కన్నీటిని కలిపేస్తాయి
కేకలు హాహాకారాలు మర్యాదలని
మరచిపోతాయి
తప్పదు
ఇన్నాళ్ళ అలసత్వం
చెల్లించే మూల్యమిది
ఓ మూన్నెళ్ళ తరువాత
నొప్పిలేక నడిచే కాలు
సంతోషాల నవ్వు పూలు
పూయించక మానదు
ఎప్పుడైనా దేనికైనా....
Recovery is a process
it takes time
it takes patience !!
