గింజ
మొలకెత్తి నప్పుడు
దాని పాదాల చెంత
నన్ను నేను
తడి భూమిలోకి
పాతేసుకుంటాను

అది ఎదిగి
పూలూ,ఫలాల్నిస్తుంది గదా
అప్పుడు
ఆవిష్కరించ బడతాను

ప్రకృతి ఆత్మ
కవిత్వీకరించ బడుతుంది