భయం కొండల్ని
పాకలేని 
నిరాశానిస్పృహలు

గుండెల్లో మతంపులి
పిడుగులైతే!
కన్నీళ్ల దోసిళ్ళతో
ప్రాణంలేని స్థితిలోకి


కాలం ఘనీభవిస్తే....
క్షణమొక
రెక్క విరిగిన పక్షి

వెంటాడే అభద్రతలో
ఊపిరి పీల్చుకోలేని
బలి పశువులు
ప్రాణాల్లే నిస్థితిలోకి
కూరుకుపోతూ....

ప్రశ్నల వాల్మీకాల్ని
చేధించలేని
సమాదానాల
సారీసృపాలు

హింస పరమ ధర్మమైన వేళ
ఏకత్వంలో
భిన్నత్వం

మెడలో....
అనైకమత్యదండల్తో
అరనిముషంలో
అందరూ
ఖతం...
వేల నాదాల్తో
అనేక గొంతులు....