నీకు తెలుసా....
మా గోడలు పుల్లగావుండేవి--ఉసిరి పిందెల్లా,
అమ్మ గోరు ముద్దలను,
చందమామతో కబుర్లను వింటూ కునుకు                                               పాట్లుపడేది
ఎప్పుడైనా పిండేసిన తేనెపట్టు మరకలుగా తీయనైయ్యేది.
థాన్యం బస్థాలను కాపుగాసి గోడ తనబలం చాటింపు వేసుకునేది.
ఎంతకీ అందని మొగ్గలు,సాయం సంధ్యకల్లా గోడమీద పరిమళంగా,మల్లెతీగను చుట్టు కొని ముసిముసిగా నవ్వేది.
రోజూనృత్య ప్రదర్శనిచ్చి వెళుతుంటాయి....కొన్ని పిచ్చుకలు,మరికొన్ని పావురాలు.
రంగుల్ని కలల్లో అద్ది,చిత్రాలుగా మలచి తృప్తి ని భుజానవేసుకొనిపోతాడు ఒక కళాకారుడు.
అజ్ఞాతంగా తమ ఆశల్ని--ఆశయాల్ని నినాదాలు చేసి నిత్యచైతన్యాన్ని ప్రదర్శించే వారిని చేరదీస్తుంది మాగోడ.
గోడంటే నీఅంతరంగ నీడలను ముద్రించుకొనే క్యాన్వాసు.
నీకు తెలుసా... 
నా బురఖాకంటే బలమైన గోడలు న్నాయి...అంటుంది అమీనా.
ఊరి చివరవున్నా,ఊరిమధ్య కొచ్చినా,మనసు పొరలలో ఇంకిన అంతరాల మాటేమిటంటావ్...
చూపుల్ని నియంత్రిస్తూ,ఆలోచనలపైకూడా జండర్అద్దకాలు వేసుకున్న మేలిముసుగు మాటేమిటంటావ్.
తరతరాలుగా, పొరలుపొరలుగా జీరాడుతున్న  వీటిని "బెర్లిన్" గోడల్లా కూల్చేది ఎప్పుడంటావ్...