ధరిత్రి దద్దరిల్లుతోంది
బరువెక్కిన వదనంతో
ఎదలో తీరని వేదనతో
పచ్చని ప్రకృతితో అలరారే
పుడమంతా సముద్రాలింకిపోయి
జన సంద్రం జగతి నిండే
అవనంతా అయోమయం
అభివృద్ధి మాటులో 
కాలుష్యం కోరలు 
ఆహారోత్పత్తిలో కల్తీ రాజ్యం
రోజుకో మాయదారి రోగం
మానవజాతిని మట్టుపెడుతుంది
ఓ వైపు కాలం మారి
మనపై దండెత్తి దాడిచేస్తుంది
మనిషికి కనబడని వైరస్లతో
అల్లాడి ఆయువు తీస్తుంది
మరోవైపు వరదలు 
కల్లోలం రేపుతున్నాయి
ఎడతెరిపి లేకుండా
వేట మొదలెట్టింది
సంద్రమై శవాలు కాలువలుగా
పరుగుతిస్తున్నాయి.