Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సాంస్కృతిక వికాస పురుషుడు బి నర్సింగ్ రావు

ప్రముఖ సృజనశీలి, ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించిన బి నర్సింగ్ రావు గురించిన అవగాహన నేటి అవసరం. బహుళ కళారంగాల్లో తన దైన చేయి వేసి అరుదైన అసాధారణ మనిషిగా నర్సింగ్ రావు ఉన్నారు. 
 

b narsing rao a renaissance man says writer Uma da chuna
Author
First Published Nov 11, 2022, 1:20 AM IST

హైదరాబాద్: అంతర్జాతీయ సంస్థల నుంచి సన్మానాలు, సత్కారాలు ఆయనకు కొత్త కావు. మరో విధంగా చెప్పాలంటే.. అలాంటి కొన్ని సంస్థలు తరుచూ ఆయన పురస్కారాలు పొందడంపై కనీసం ఆశ్చర్యం కూడా చూపించవు. బహుళ కళారూపాల్లో తన సృజనను ఉచ్ఛస్థాయిలో చూపిన ఆయన జీవిత ప్రయాణాన్ని చూస్తే ఇది అతిశయోక్తి అనీ అనిపించవు. సృజనాత్మక రంగాల్లో బహుళ రూపాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. అందుకే ఆయన థియేటర్, సినిమా, సంగీతం, సాహిత్యం, పెయింటింగ్, శిల్పం, ఫొటోగ్రఫీ, ఫోక్‌లోర్, ఆంథ్రపాలజీ, ఎత్నోగ్రఫీ వంటి క్షేత్రాల్లో అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన బొంగు నర్సింగ్ రావు.

పది జాతీయ, తొమ్మిది రాష్ట్ర అవార్డులు సహా అంతర్జాతీయంగా అసంఖ్యాక పురస్కారాలను బి నర్సింగ్ రావు పొందారు. తెలంగాణ  పై ఉన్న గాఢమైన ప్రేమనే ఆయనను సృజనాత్మకంగా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి దోహదం చేశాయని అర్థం అవుతాయి. ఎందుకంటే.. ఆయన సృజన మొత్తం కూడా తెలంగాణ ప్రాంతం, అరుదైన సాంస్కృతిక సంపద, తెలంగాణ ప్రజలు, మైమరిపించే జానపదాల చుట్టే బి నర్సింగ్ రావు క్రియేటివిటీ తిరుగుతూ ఉంటుంది.

ఆయనలోని బహుళ కళాకారుల సామర్థ్యానికి గుర్తుగానే ప్రముఖ ఫెడరేషన్ ఆఫ్ వరల్డ్ కల్చరల్ అండ్ ఆర్ట్ సొసైటీ సింగపూర్ బి నర్సింగ్ రావును 2021లో బోర్డులోకి తీసుకుంది.  160 దేశాల సభ్యత్వం కలిగిన ఈ సంస్థలో కేవలం 12 సెలెబ్రిటీలు మాత్రమే గౌరవ సలహాదారులుగా నియామకం కావడం గమనార్హం. ఇది బి నర్సింగ్ రావు విశేషమైన వ్యక్తిత్వానికి, ఆయన విజయాలకు నిదర్శంగా ఉంటుంది. మొరాకో, ఫిలిప్పీన్స్‌ల నుంచి డాక్టరేట్ పొందిన ఆయనను సింగపూర్, యూకేలు గౌరవించాయి. కజక్‌స్తాన్, వెనెజులాలు వాటి అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేశాయి. మా భూమి, రంగులకల, దాసి,మట్టి మనుషఉలు, హరివిల్లు వంటి సామాజిక అంశాలపై తీసిన సినిమాలకు గాను ఆయనను గౌరవించని అంతర్జాతీయ సంస్థ లేదు.

Also Read: నాగిళ్ళ రామశాస్త్రికి కాళోజీ తత్వనిధి పురస్కారం

2007లో హైదరాబాద్‌లో నిర్వహించిన డైమండ్ జూబిలీ వేడుకల్లో ఎక్స్‌లెన్స్ అవార్డును బి నర్సింగ్ రావుకు ప్రదానం చేశారు. కైరో (2004), బుడాపెస్ట్ (1999), బెర్గామో, ఇటలీ (1994), బెర్లిన్, మాస్కో, చెకోస్లోవేకియా, మ్యూనిచ్‌లలో భారత సినిమా ఫెస్టివల్స్‌లో గౌరవించారు. ఫ్రాన్స్, స్లోవేకియా, స్విట్జర్లాండ్, కెనడా, స్వీడన్,ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఇరాక్, జర్మనీ, ఇటలీ, రష్యా, ఇరాన్, బంగ్లాదేశ్‌లలో నిర్వహించిన అంతర్జాతీయ సినిమా వేడుకల్లో బి నర్సింగ్ రావు సినిమాలు ప్రదర్శించారు.

తెలంగాణాలోని ప్రజ్ఞాపూర్‌లో 1946 డిసెంబర్ 26న జన్మించిన నర్సింగ్ రావు అణచివేతకు గురైన ప్రజల పక్షాన నిలబడ్డారు. ఆంధ్ర ఆధిపత్యాన్ని ధిక్కరించి తెలంగాణ ఉద్యమంలో వెన్నుదన్నుగా ఉన్నారు.

1984లో ఆయన రంగుల కల సినిమాను ముంబయిలోని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివ్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని  డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ భారత సినిమాలపై ఓ పుస్తకాన్ని ప్రచురించింది. అందులో రచయిత ఉమా దా చునా రాసిన ప్రముఖ వ్యాసంలో నర్సింగ్ రావును సాంస్కృతిక వికాస పురుషుడు అని పేర్కొంది.  ఈ పదం ఆయన అసాధారణ జీవితానికి సరిగ్గా సరిపోలుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios