పరిచయంలేని వారితో ఒకరాత్రి.. ఒకే అంటున్న యువత

అసలు తమకు ఎలాంటి పరిచయం లేని ఓ వ్యక్తితో ఒక రాత్రి అంతా గడపడానికి ఈ కాలం యువత ఎలాంటి సందేహం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.

youth intrested on new trend 'casual sex'

ప్రస్తుత కాలంలో యువత ప్రతిదీ అడ్వెంచర్ గా ఉండాలని.. భిన్నంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. కొత్తగా ఏ ట్రెండ్ వస్తే.. దానిని ఫాలో అవ్వాల్సిందే అన్నట్లు ఉంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఆ ట్రండ్ ని ఫాలో అవ్వకపోతే.. అదేదో పెద్ద నేరంగా చూసేవాళ్లు కూడా ఉన్నారు. డ్రస్సులు, స్మార్ట్ ఫోన్లు లాంటి ట్రెండ్ ఫాలో అయితే పర్లేదు.. వాటిని దాటి మరో సరికొత్త ట్రెండ్ కి కూడా తెరలేపుతున్నారు. అదే క్యాజువల్ సెక్స్.

ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో ఈ క్యాజువల్ సెక్స్ గురించి చాలా విషయాలు భయటపడ్డాయి. అసలు తమకు ఎలాంటి పరిచయం లేని ఓ వ్యక్తితో ఒక రాత్రి అంతా గడపడానికి ఈ కాలం యువత ఎలాంటి సందేహం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.

అర్బన్ ఇండియాలో గత పదిహేనేళ్లలో వచ్చిన భారీ మార్పులో ఈ క్యాజువల్ సెక్స్ ఒకటి. మెట్రో నగరాల్లో 41శాతం మంది యువకులు, 29శాతం మంది యువతులు ఒక రాత్రి అనుభవవానికి సముఖంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో ప్రతి ఏడుగురిలో ఒకరు.. తమకు పరిచయం లేనివారితో రాత్రి గడిపామని అంగీకరించారు. అంతేకాదు.. సెల్ఫ్ పోర్న్ ని వారు అదో కొత్త ట్రెండ్ గా భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. 

ఇంకొందరైతే.. సెల్ఫీలు తీసుకున్నంత సింపుల్ గా తమ పార్టనర్స్ తో కలిసి రతిక్రీడను వీడియోలుగా తీసుకుంటున్నారట. ఆ వీడియోలను వారే స్వయంగా స్నేహితులతో షేర్ చేసుకుంటున్నట్లు తెలిసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios