Asianet News TeluguAsianet News Telugu

స్త్రీ ఎద సంపద శృంగారానికి కాదు... అమ్మాయిలు ఇక టాప్ లెస్ గా తిరగొచ్చు

మహిళలు టాప్ లెస్ గా తిరగవచ్చని అమెరికాలోని ఓ కోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. అమెరికాలోని ఉటా, కొలరాడో, వోమింగ్, న్యూమెక్సికో, కన్సాస్, ఒక్లహామా రాష్ట్రాల్లో మహిళలు ఎదపై ఎలాంటి దుస్తులు, కనీసం బ్రా కూడా లేకుండా తిరిగే స్వేచ్ఛను కోర్టు ఇచ్చింది. ‘‘ఫ్రీ ద నిపిల్’’ అనే ఉద్యమంలో భాగంగా కోర్టు ఈవిధమైన తీర్పు వెల్లడించాల్సి వచ్చింది.
 

Women can now legally go topless in 6 states, after federal ruling
Author
Hyderabad, First Published Sep 28, 2019, 1:16 PM IST

బిడ్డ పుట్టగానే ఆకలి తీర్చేది స్త్రీ స్థనాలే. అలాంటి ప్రదేశాన్ని పురుషులు శృంగార వాంఛ తీర్చుకునే ఓ శరీర భాగంగా భావిస్తుంటారు. అంతెందుకు పురుషులు దుస్తులు లేకుండా తిరిగినా ఎవరూ పట్టించుకోరు. అదే స్త్రీ కొద్దిగా పొట్టి దస్తులు వేసుకున్నా... అదో పెద్ద నేరంగా చూస్తారు. అయితే... ఇక నుంచి స్త్రీలు టాప్ లెస్ పూర్తి స్వేచ్ఛతో తిరగవచ్చని న్యాయస్థానం తీర్పువెలువరించింది.

స్త్రీ ఎదభాగం శృంగారానికి సంబంధించినది కాదని... వారి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని కోర్టు తేల్చిచెప్పింది. ఇక నుంచి మహిళలు తమ ఇష్టారాజ్యంగా టాప్ లెస్ పబ్లిక్ గా తిరిగే అవకాశం ఇస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పారు. కాకపోతే ఇది మన దేశంలో కాదులేండి. అమెరికాలో.

ఇంతకీ మ్యాటరేంటంటే... మహిళలు టాప్ లెస్ గా తిరగవచ్చని అమెరికాలోని ఓ కోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. అమెరికాలోని ఉటా, కొలరాడో, వోమింగ్, న్యూమెక్సికో, కన్సాస్, ఒక్లహామా రాష్ట్రాల్లో మహిళలు ఎదపై ఎలాంటి దుస్తులు, కనీసం బ్రా కూడా లేకుండా తిరిగే స్వేచ్ఛను కోర్టు ఇచ్చింది. ‘‘ఫ్రీ ద నిపిల్’’ అనే ఉద్యమంలో భాగంగా కోర్టు ఈవిధమైన తీర్పు వెల్లడించాల్సి వచ్చింది.

స్త్రీలు పబ్లిక్ లో టాప్ లెస్ గా తిరగనివ్వకపోవడం అంటే వారి స్వేచ్ఛకు, లింగ సమానత్వానికి భంగం వాటిల్లినట్లేనంటూ ఇద్దరు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఫ్లెయింటిఫ్స్ బ్రిట్ హోగ్ లాండ్, సమంత సిక్స్ అనే ఇద్దరు మహిళలు కోర్టులో దావా వేశారు. ఈ సందర్భంగా వారి తరపు న్యాయవాది వారి వాదనలను వినిపించారు.

‘‘ఎండాకాలం వచ్చేస్తోంది.. పురుషులు షర్ట్ లేకుండా తిరుగుతుంటారు. కానీ అదే పని అమ్మాయిలు చేస్తే మాత్రం తప్పా? స్త్రీ, పురుషులకు మధ్య తేడా ఎందుకు?’’ అని ఆ మహిళలు కోర్టును ప్రశ్నించారు. వారి వాదనను కోర్టు కూడా అంగీకరించింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలే పెద్ద మార్పునకు దారి తీస్తాయని కోర్టు అభిప్రాయపడింది.

మహిళలను టాప్ లెస్ గా తిరగనివ్వకపోవడం వల్ల ఆడవారి దేహం, స్థనాలు కేవలం శృంగారానికి సంబంధించినవే అనే భావన ఏర్పడుతుందని కోర్టు పేర్కొంది. ఈ అభిప్రాయం నుంచి ప్రజలు బయటకు రావాలని అందుకే ఈవిధమైన తీర్పు ఇస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios