Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ కి దూరమైతే..?

సెక్స్‌ లోపం వల్ల దాని మీద ఆసక్తి క్రమక్రమంగా సన్నగిల్లటం లేదా దొరకని వస్తువు మీద ఆశ పెరిగినట్టు సెక్స్‌ కోసం వెంపర్లాడటం లాంటివి జరుగుతాయి

What Happens to Your Health If You Stop Having Sex?
Author
Hyderabad, First Published Jan 28, 2019, 4:50 PM IST

భార్యభర్తల మధ్య బంధం బలపడాలంటే.. వారి సెక్స్ వల్ లైఫ్ కూడా అంతే అందంగా, ఆనందంగా ఉండాలి. అయితే.. ప్రస్తుత కాలంలో అందరూ సమయం వెంట పరిగెడుతున్నారు. దీంతో పని ఒత్తిడి కారణంగా సెక్స్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కొందరు చాలా వరకు ఈ జీవితానికి దూరంగా ఉంటున్నారు. మరి కొందరేమో లైఫ్ పార్టనర్ ఇష్టం లేదనో, ఇంకేదే ఇంకేదో కారణంతోనే సెక్స్ కి దూరంగా ఉంటున్నారు. మరి ఇలా చేయడం కరక్టేనా అంటూ.. ముమ్మాటికీ తప్పే అంటున్నారు నిపుణులు. సెక్స్ కి దూరమైతే.. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట.

ఆరోగ్యంగా ఉండి భాగస్వామితో విభేదాలు లేదా అనారోగ్యం వల్ల లైంగిక జీవితానికి దూరమైతే లైంగికాసక్తి సన్నగిల్లటం సహజం. అరుదుగా కొందర్లో ఈ పరిస్థితి సెక్స్‌ ఆలోచనలను రెట్టింపు చేస్తుంది కూడా. సెక్స్‌ లోపం వల్ల కొందరు నీరసంగా అయిపోవడం లాంటివి జరుగుతుంది. 

ఇంకొందరికేమో..సెక్స్‌ లోపం వల్ల దాని మీద ఆసక్తి క్రమక్రమంగా సన్నగిల్లటం లేదా దొరకని వస్తువు మీద ఆశ పెరిగినట్టు సెక్స్‌ కోసం వెంపర్లాడటం లాంటివి జరుగుతాయి. ఈ రెండూ అనారోగ్యకరమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇక స్త్రీల విషయానికి వస్తే.. రక్త ప్రసరణ జరగక యోని గోడలు బలహీనంగా సన్నగా మారిపోతాయి. రోగ నిరోదక శక్తి కూడా తగ్గిపోతుంది. అంతేకాదు.. ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. స్త్రీల యోని లూసుగా మారిపోతుంది.  అలా అయిన తర్వాత సెక్స్ చేయడం ప్రారంభించినా.. దానిని ఆనందించలేరు. 

Follow Us:
Download App:
  • android
  • ios