దేవుళ్లు కూడా ఇది తప్పక పాటిస్తారు.. ఆలోజింపజేస్తున్న యాడ్‌. సూపర్‌ వీడియో అసలు..

Viral Video: ప్రకటనలు ఎంత ఆకర్షణీయంగా ఉంటే యూజర్లు అంత ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. వస్తువు నాణ్యత ఎంత ముఖ్యమో దానిని ప్రమోట్‌ చేసే విధానం కూడా అంతే ముఖ్యం. నిత్యం మనం చూసే ప్రకటనల్లో కేవలం కొన్ని మాత్రమే మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. అలాంటి ఓ ప్రకటన గురించి ఈరోజు తెలుసుకుందాం.. 
 

Viral Video about awareness of wearing helmet VNR

నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మెజారిటీ రోడ్డు ప్రమాదాల్లో మనం చేసే తప్పిదాలే ఎక్కువగా ఉంటాయి. తెలిసో తెలియకో చేసే మిస్టేక్స్‌ భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయి. అందుకే వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతుంటారు. కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచిస్తుంటారు. పాటించని వారికి జరిమానాలు కూడా విధిస్తుంటారు. అయినా కూడా మనలో చాలా మంది ట్రాఫిక్‌ నిబంధనలను గాలికి వదిలేస్తుంటారు. 

ప్రమాదాలు జరిగే సమయంలో మనిషి ప్రాణాలను రక్షించడంలో హెల్మెట్‌ల పాత్ర ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చాలా మంది హెయిర్‌ స్టైల్‌ పాడవుతుందని, వేడిగా ఉంటుందని కొంటె సాకులతో హెల్మెట్‌ను ఉపయోగించరు. అయితే హెల్మెట్ ప్రాముఖ్యత ఎలాంటిదో అని చెప్పే ఓ ప్రకటనకు సంబంధించిన వీడియో అందరినీ ఆలోజింప చేస్తోంది. నిజానికి ఈ యాడ్‌ వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా మళ్లీ ఇందుకు సంబంధించి రీల్స్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటంటే. 

దుర్గామాత, వినాయకుడు, మహా విష్ణువు ఎక్కడికో వెళ్లేందుకు తమ తమ వాహనాలనైన సింహం, గరుడ పక్షి, ఎలుకపై ఎక్కుతారు. అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటారు. అయితే ప్రయాణం మొదలు పెట్టగానే ఒక్కసారిగా ఆగి తమ కిరీటాలను ధరిస్తారు. అంటే ఇక్కడ కిరీటాన్ని హెల్మెట్‌తో పోల్చారన్నమాట. ఇక వీడియో చివరిలో వచ్చే 'మిమ్మల్ని రక్షించే దేవుళ్లు కూడా వారి తలలను కాపాడుకుంటారు. మీరు కూడా మీ తలను హెల్మెట్‌తో భద్రంగా ఉంచుకోండి' అనే కొటేషన్‌ చాలా బాగుంది. హెల్మెట్‌ ప్రాముఖ్యతను సింపుల్‌గా 54 సెకండ్ల నిడివి ఉన్న వీడియోతో అద్భుతంగా తెలిపారు ఈ ప్రకటనలో. నిజంగానే ఆలోజింపజేసాల ఉంది కదూ ఈ వీడియో. మరి ఓసారి ఈ ప్రకటనపై మీరు కూడా ఓ లుక్కేయండి.. 

వైరల్ వీడియో.. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios