ఎండాకాలం వచ్చిందంటే చాలు... మద్యం ప్రియుల చూపులన్నీ.. బీరుపైనే ఉంటాయి. చల్లటి బీరు తాగి ఎండ నుంచి ఉపశమనం పొందుతుంటారు. అయితే... ఈ బీర్లు ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరుగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే... ఓ వ్యక్తి మాత్రం చిత్రంగా బీరు తాగి బరువు తగ్గాడు. కేవలం 46 రోజుల్లో 20కేజీల బరువు తగ్గాడు. బీరు తప్ప మరే ఆహారం తీసుకోలేదు. అంతే... అతని శరీరంలో వచ్చిన మార్పు చూసి అందరూ షాక్ అయ్యారు.

43ఏళ్ల డెల్ హాల్... కేవలం 46 రోజుల్లో 20 కేజీల బరువు తగ్గాడు. ఇతను సాధారణం కన్నా ఎక్కువ బరువు ఉన్నాడు. అది తగ్గించుకునేందుకు ఇలా ప్లాన్ చేశాడు.  ‘బీర్ డైట్’ అనేది ప్రాచీన కేథలిక్ సాంప్రదాయం. సుమారు 1600 ఏళ్ల కిందట సన్యాసులు ఈ డైట్ పాటించేవారు. 

దీంతో డెల్‌కు కూడా ‘బీర్ డైట్’ పాటించేందుకు కంకణం కట్టుకున్నాడు. 46 రోజులపాటు వేరే ఆహారం ముట్టుకోకుండా రోజుకు 5 బీర్లు మాత్రమే తాగేవాడు. స్పెషల్ గా బీరు కేసులు కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. జర్మనీకి చెందిన ‘బోక్ బీర్’ కేసును ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ బీర్‌ను లిక్విడ్ బ్రెడ్ అని కూడా అంటారు. ఒహియోలో నివసిస్తున్న డెల్ హాల్ ఓ బీరు తయారీ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పెట్టగా... న్యూస్ వైరల్ గా మారింది.