రోడ్డుపై కుక్కలు వెంటపడితే వెంటనే ఏం చేయాలో తెలుసా?

వీధి కుక్కలు రెచ్చిపోయి చిన్నారుల ప్రాణాలను దారుణంగా తీసేస్తున్న ఘటనలను మనం రోజూ పేపర్ లో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం.. చిన్న పిల్లలు, ముసలి వాళ్లు అని తేడా లేకుండా.. వెంటాడి.. కరిచి చంపేస్తున్నాయి. కుక్కల దాడి బారిన పడకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

 tips to protect yourself from a stray dogs attack rsl


పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా వీధి కుక్కలు మనుషులపై దాడులకు దిగుతున్నాయి. ఒంటరిగా లేదా ఇద్దరు ముగ్గురు ఉన్నా.. వెంటనే దాడి చేసి చంపేస్తున్నాయి. వీధి కుక్కల దాడి వల్ల ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఆడుకుంటున్న పిల్లలపై కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనలను మీరు టీవీల్లో చూసే ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడు కుక్కలంటే వెన్నులో వణుకు పుడుతుంది. పిల్లల్నే కాకుండా.. బైక్ పై వెళుతున్న వారి వెంబడించి కూడా కుక్కలు కరుస్తున్నాయి. ఈ కుక్కల భయంతో బైక్ ను ఫాస్ట్ గా నడిపి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అందుకే వీధి కుక్కలు మనపై దాచి చేయడానికి వెంబడించినప్పుడు వెంటనే ఏం చేయాలి? వాటి బారిన నుంచి ఎలా సురక్షితంగా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కుక్క మీ వెంట పడితే ఏం చేయాలి? 

కుక్కలు మీ వెంట పరుగెత్తినా లేదా మిమ్మల్ని చూసి మొరగడం స్టార్ట్ చేసినా.. మీరు టెన్షన్ పడకండి. భయపడకండి. వాటి ముందు మీరు ప్రశాంతంగా, స్థిరంగా నిలబడండి. ఇలా కాకుండా.. అరుస్తున్నాయనో లేక వెంటపడుతున్నాయనో మీరు పరుగెత్తితే మాత్రం కుక్క మీపై ఖచ్చితంగా దాడి చేస్తుంది. మీ వెండ పడుతుంది. అందుకే మీరు ఇలాంటి సమయంలో కదలకుండా స్థిరంగా, ధైర్యంగా ఉంటే.. కుక్కల దూకుడు తగ్గుతుంది. అలాగే పక్కకు వెళ్లిపోతాయి. 

గట్టిగా అరవండి

కుక్కలు మిమ్మల్ని చూసి అరిచినా, మీ దిక్కు వస్తున్నా.. గట్టిగా అరవండి. బిగ్గరగా నో లేదా స్టాప్ అని అనండి. చాలా కుక్కలు ఈ పదాలను గుర్తించి ప్రతిస్పందిస్తాయి. మీరు ఆర్టర్ వేసినట్టు అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాయి. 

వీటితో రక్షించుకోండి

మీదగ్గర ఏదైనా బ్యాగ్ లేదా గొడుగు, జాకెట్ వంటి ఎలాంటి వస్తువు ఉన్నా.. దాన్ని మీరు కుక్కల దాడి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కుక్క మీకు దగ్గరగా వచ్చినప్పుడు మీ దగ్గరున్న వస్తువులను మీకు, కుక్కు మధ్యన పెట్టండి. ఇది కుక్కను తికమక పెడుతుంది. అలాగే దీనివల్ల కుక్క మీపై దాడి చేయకుండా ఉంటుంది. 


నెమ్మదిగా వెనక్కి అడుగు

కుక్క మీపై దాడి చేయడానికి సిద్దంగా ఉంటే.. దాని నుంచి వెంటనే పారిపోయే ప్రయత్నం మాత్రం చేయకండి. కుక్క మీకు ఎదురుగా ఉన్నప్పుడు వెంటనే పారిపోవడానికి బదులు నెమ్మదిగా వెనక్కి వెళ్లండి. అలాగే కుక్కను గమనించండి. త్వరగా దూరంగా వెళ్లడానికి లేదా పారిపోవడానికి ప్రయత్నిస్తే కుక్క మీపై చాలా ఫాస్ట్ గా దాడి చేస్తుంది.

శాంతపరచడానికి ప్రయత్నం

కుక్క మీపై దాడికి ప్రయత్నించినప్పుడు దానిపై అరవడానికి బదులుగా.. దాన్ని ప్రేమగా చూడండి. అలాగే మీ మాటలతో దానిని శాంతపరచడానికి ప్రయత్నించండి. కుక్క మొరిగితే లేదా పరిగెత్తితే.. కూల్ గా ఉండమని లేదా నిశ్శబ్దంగా లేచి నిలబడమని ప్రేమగా అడగండి. కుక్కలకు మన ఎక్స్ ప్రెషన్స్ బాగా అర్థమవుతాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios