Asianet News TeluguAsianet News Telugu

ఉదయం లేవడానికి బద్దకంగా అనిపిస్తోందా? ఇలాచేసి చూడండి తొందరగా లేస్తారు

ఉదయం ఎంత తొందరగా నిద్రలేస్తే.. మీరు అంత ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. రోజు కూడా ఫుల్ ఎనర్జిటిక్ తో కంప్లీట్ అవుతుంది. అయితే చాలా మందికి ఉదయం నిద్రలేవడానికి బద్దకంగా అనిపిస్తుంది. దీంతో ఉదయం 8-9 గంటలకు నిద్రలేస్తుంటారు. కానీ మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం ఉదయం తొందరగా నిద్రలేస్తారు. అవేంటంటే? 
 

tips to include morning routine to increase productivity rsl
Author
First Published Aug 24, 2024, 4:27 PM IST | Last Updated Aug 24, 2024, 4:27 PM IST


మీ రోజంతా ఎలా గడుస్తుందనేది మీ ఉదయం ఎలా ప్రారంభమవుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. అవును మీరు ఉదయం తొందరగా నిద్రలేస్తే.. మీరు రోజంతా ఎనర్జిటిక్ గా, ఆనందంగా ఉంటారు. కానీ చాలా మందికి ఉదయాన్నే నిద్రలేవడం పెద్ద కష్టంగా ఉంటుంది. చలిపెడుతుందని, నిద్రవస్తుందని చాలా మంది పోద్దు పోయినాక నిద్రలేస్తుంటారు. కానీ దీనివల్ల రోజంతా డిస్టర్బ్ అవుతుంది. లేట్ గా లేవడం వల్ల త్వరత్వరగా పనులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది మీపై ఒత్తిడిని పెంచుతుంది. మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ఉదయాన్నే నిద్రలేవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నీళ్లు తాగాలి

ఉదయం మీరు కళ్లు తెరవగానే ముందుగా చేయాల్సిన పని నీళ్లు తాగి మిమ్మల్ని హైడ్రేట్ చేసుకోవడం. రాత్రంతా మీరు నీళ్లను తాగకపోవడం వల్ల మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేషన్ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మీరు ఉదయం నీళ్లను ఖచ్చితంగా తాగాలి. ఒకవేళ మీకు నార్మల్ వాటర్ తాగాలనిపించకపోతే.. గోరువెచ్చని నీళ్లను తాగండి. ఇది మీ ప్రేగు కదలికను కూడా మెరుగుపరుస్తుంది. దీంతో మీ కడుపు ఖాళీ అవుతుంది.

తేలికపాటి సాగదీత 

ఉదయం లేవగానే శరీరం బిగుసుకుపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకే ఉదయం మీరు లేవగానే శరీరాన్ని తేలికగా సాగదీయండి. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. సాగదీయడం  వల్ల మీ కండరాల బిగుతు తొలగిపోతుంది. అలాగే ఫీల్ గుడ్ హార్మోన్లు  విడుదల అవుతాయి. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే ఇది మీ రోజుకు మంచి ప్రారంభాన్ని ఇస్తుంది. 

ధ్యానం

ఉదయాన్నే నిద్రలేచి కాసేపు ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని ధ్యానం చేయండి. ధ్యానం మీ దృష్టిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మీరు మంచి అనుభూతిని పొందుతారు. ఇది కాకుండా ధ్యానం కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

రోజును ప్లాన్ చేయండి

పగటిపూట మీరు ఏమి చేయబోతున్నారో ఒక జాబితాను తయారు చేయండి. దానిప్రకారమే పనులు చేయండి. ముందుగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో, దానికి ఎంత టైం కేటాయించాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మీ పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ఇది మీకు మంచి ఫీలింగ్ ని కలిగిస్తుంది. 

ఆరోగ్యకరమైన అల్పాహారం 

ఏదేమైనా ఉదయం మంచి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అంతే కాదు బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు రాకుండా రోజంతా బాగుంటారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios