పెండ్లి రోజు ఇలా ఉండాలి!! తీసుకోవాల్సిన జాగ్రత్తలివి!!!
పెండ్లి అంటే ఏడడుగులు.. నూరేళ్ల పంట. ఇది ఎంతో ప్రత్యేకం. అందునా వివాహ దినోత్సవం అంటే దంపతులకు వెరీ స్పెషల్. వివాహ వార్షికోత్సవ వేడుక అంటే మీ జీవితంలో ఆనందమయ, సంతోషదాయక రోజుల్లో ఒక్కటంటే అతిశయోక్తి కాదు. ఒత్తిళ్లు, ఆందోళన సమ్మేళనంగా ఉంటుంది వివాహ దినోత్సవం.
పెండ్లి అంటే ఏడడుగులు.. నూరేళ్ల పంట. ఇది ఎంతో ప్రత్యేకం. అందునా వివాహ దినోత్సవం అంటే దంపతులకు వెరీ స్పెషల్. వివాహ వార్షికోత్సవ వేడుక అంటే మీ జీవితంలో ఆనందమయ, సంతోషదాయక రోజుల్లో ఒక్కటంటే అతిశయోక్తి కాదు. ఒత్తిళ్లు, ఆందోళన సమ్మేళనంగా ఉంటుంది వివాహ దినోత్సవం. కొన్ని సందర్భాల్లో అది విచారకర అంశాలను కంట్రోల్ చేయడానికి గానీ, భిన్నంగా ‘వెడ్డింగ్’ ప్రణాళిక రూపొందించుకోవడానికి గానీ దంపతులు ప్రయత్నిస్తుంటారు. లక్కీగా మీరు సిద్ధంగా ఉంటే కొన్ని నెలల ముందే సిద్దం అవుతారు. పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు.
పెండ్లి కోసం కొన్ని పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నదని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వివాహ దినోత్సవానికి భారీగా అతిథులను ఆహ్వానించడం డబ్బు ఖర్చుతో కూడుకున్నది. వెడ్డింగ్ ప్లానింగ్, దాని అమలు చేయడం చాలా వ్యయ ప్రయాసలకు నిలయంగా మారుస్తోంది. వివాహాల సమయంలో కొందరు చేసే తమాషా పనులు కూడా అర్థం లేనివి. భారతీయ వివాహాలంటేనే కొన్ని బాధ్యతల సమాహారం. నీ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా నీ తల్లిదండ్రులు పెండ్లికి అతిథులను ఆహ్వానిస్తుంటారు. నీవు, నీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, వారి బంధుమిత్రులు, అతిథుల రాకతో జరిగే వివాహం అతిపెద్ద వివాహ వేడుకవుతుంది. వివాహం అంటే కేవలం ఒక్క పంక్షన్ మాత్రమే. వివాహం అంటే మీ వ్యక్తిగత కార్యక్రమం మాత్రమే. సంగీత్ కంటే పెండ్లి నాడు అతిథులను ఆహ్వానించే విషయమై జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
డబ్బు పొదుపు చేసే క్రమంలో కొన్ని అంశాలను తప్పిస్తుంటాం. అందులో ఒకటి ఫొటోగ్రాఫర్ నియామకం ఒకటి. డబ్బు పొదుపు కోసం ప్రయత్నించడంతో మీ కుటుంబం, బంధు మిత్రులతో కలిసి పుష్కలమైన ఫొటోలను దూరం చేసుకున్నట్లే. ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకుంటే బిజీగా ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులంతా కలిసి తమాషా చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. ఈ మధుర ఘటనలు ఎవరూ ఒకరు ఫొటోలుగా చిత్రీకరించాల్సిందే. కనుక మీరు ఒక ఫొటోగ్రాఫర్‌ను నియమించుకుంటే ఈ సమస్య నుంచి బయటపడినట్లే.
పెండ్లి వేళ నూతన దంపతులు ధరించే దుస్తులు, ఆభరణాలు, మీ హెయిర్ స్టయిల్‌ను సరిగ్గా మేకప్ చేసుకోవాలి. వివాహం సందర్భంగా మీరు శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రాదాన్యం ఇవ్వాలి. అసౌకర్యంగా ఉండే అంశాలను దూరంగా ఉంచాలి. హెయిర్ స్టైల్ మేకప్ బాగా చేసుకోవాలి. డ్రస్ కూడా అందంగా తీర్చుకోవాలని కోరుతున్నారు.