Asianet News TeluguAsianet News Telugu

రోజూ శృంగారంలో పాల్గొంటే.. ఆ లాభం కూడా..

భార్య భర్త దాంపత్య జీవితానికి శృంగారం చాలా ముఖ్యమన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే.. కేవలం దంపతుల మధ్య బంధాన్ని మెరుగుపరచడానికి మాత్రమే కాదు.. శృంగారం కారణంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

survey says.. sexual life makes people more productive
Author
Hyderabad, First Published Mar 4, 2019, 3:03 PM IST

భార్య భర్త దాంపత్య జీవితానికి శృంగారం చాలా ముఖ్యమన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే.. కేవలం దంపతుల మధ్య బంధాన్ని మెరుగుపరచడానికి మాత్రమే కాదు.. శృంగారం కారణంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

మీరు చదివింది నిజమే... ఫీసులో మీ పని తీరుకు.. మీ శృంగార జీవితానికి చాలా దగ్గరి సంబంధం ఉంది.. అని అంటున్నారు నిపుణులు. ఓ సంస్థ చేసిన  పరిశోధనలో ఈ విషయం వెల్లడయ్యింది. వారి పరిశోధన ప్రకారం.. శృంగార జీవితాన్ని చక్కగా ఆస్వాధిస్తున్న వాళ్లు ఆఫీసుల్లో బాగా పని చేయగలుగుతున్నారని చెబుతున్నారు. 

రాత్రి భాగస్వామితో లైంగికానందాన్ని పొందిన వాళ్లు మరుసటి రోజు పగలు ఆఫీసులో బాగా పనిచేయగలుగుతున్నారని.. దీని వల్ల వారి నుంచి ప్రొడక్టివిటీ బాగుంటోందని అధ్యయనకర్తలు వివరించారు. కొన్ని వందల మంది జంటలపై తాము అధ్యయనాన్ని నిర్వహించామని.. దాని ఫలితాలు అలా ఉన్నాయని వారు వివరించారు. 

సెక్సువల్ లైఫ్ ను బాగా ఆస్వాధించే వారు పనిలో కూడా దూసుకుపోతారని. ఇలా చక్కటి పనితీరును కనబరిచే వారి కెరీర్ కూడా బాగుంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విధంగా సెక్సువల్ లైఫ్ కు కెరీర్ లో ప్రమోషన్స్ కు సంబంధాలుంటాయని పరిశోధకులు పేర్కొన్నారు. 

వివాహితులు అయిన ఉద్యోగుల రెండు వారాల పనితీరును పరిగణనలోకి తీసుకుని పరిశోధన సాగించారు. వీరిలో క్రితం రోజు రాత్రి ఆ అనుభవాన్ని కలిగిన వారిలో ఫుల్ పాజిటివ్ మూడ్స్ కనిపించాయట. దీని వల్ల వాళ్లు ఉత్సాహంగా పని చేశారట. రాత్రి సెక్స్ అనుభవం లేని వాళ్లలో మరుసటి రోజు అంత ఉత్సాహం లేదు. వీళ్లలో అంత జోష్ లేదు.. అని పరిశోధకులు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios