భార్యలు విడాకులు కోరడానికి ప్రధాన కారణాలు ఇవే..
విడాకుల టాపిక్ ఎక్కువగా తీసుకువచ్చేదే మహిళలేనట. 43వేల మంది మహిళలపై చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ప్రస్తుత కాలంలో పెళ్లి జరిగిన సంవత్సరంలోపే విడిపోతున్నారు. చిన్న చిన్న మనస్పర్థల కారణంగా కూడా కోర్టు మెట్లు ఎక్కేస్తున్నారు. అయితే..ముఖ్యంగా మహిళలు విడాకులు కోరడానికి కొన్ని కారణాలు ఉన్నాయట. ఈ కారణాలు కారణంగానే చాలా మంది దంపతులు విడాకులు తీసుకుంటున్నారు.
పురుషుల కన్నా మహిళలే ముందు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారట. విడాకుల టాపిక్ ఎక్కువగా తీసుకువచ్చేదే మహిళలేనట. 43వేల మంది మహిళలపై చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఆస్ట్రేలియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ స్టడీస్ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆ సర్వేలో వివాహం జరిగి పిల్లలు ఉన్న మహిళలే విడాకులు తీసుకోవాలని భావిస్తున్నారట. వారందరూ ఉద్యోగాలు చేసేవారు కావడం గమనార్హం.
భర్తలు సహాయం చేయకపోవడం వల్లే అసలు సమస్య మొదలౌతోందట. పిల్లలను చూసుకోవడం, ఇంటిపని ఆఫీసు పని... అన్ని పనులు మహిళలు ఒక్కరే చూసుకోవాల్సి వచ్చినప్పుడే విడాకుల గురించి ఆలోచన తీసుకువన్తున్నారట.
అంతేకాదు.. పెళ్లి చేసుకున్నాక జీవితంలో తాము అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేకపోతున్నామనే ఫీలింగ్ కలిగినప్పుడు, తమ ఐడెంటిటీ కోల్పోయినప్పుడు, తరచూ గొడవలు జరుగుతున్నప్పుడు, మెంటల్ స్ట్రెస్, ఆలోచనలు ఎక్కువైనప్పుడు, లైఫ్ చాలా బోర్ గా అనిపించినప్పుడు, భర్త నుంచి శారీరక, మానసిక దాడులు ఎక్కువైనప్పుడు, ఇంటి సమస్యలు, మనీ సమస్యలు లాంటివి ఎదురైనప్పుడు విడాకులు తీసుకోవాలనే ఆలోచన వస్తుందట.
ఈ కారణాల వల్లే మహిళలు.. తమ భర్తల నుంచి విడిపోయి స్వతంత్ర్యంగా బ్రతకాలని భావిస్తున్నారని సర్వేలో తేలింది.