Asianet News TeluguAsianet News Telugu

వ్యాయామం చేస్తున్నారా? ఈ చర్మ సంరక్షణ చిట్కాలు పాటిస్తున్నారా?

వ్యాయామం చేసేముందు, చేసిన తరువాత.. చేసే సమయంలో skin care విషయంలో రోజువారీ తప్పనిసరి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మసంరక్షణ విషయంలో శ్రద్ధ పెట్టకపోతే జిమ్ లు, పార్కుల్లో రన్నింగులు, యోగాలు చేసి కూడా పెద్దగా ఫలితాలు ఉండవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

Skincare tips to follow before, after and during your workouts
Author
Hyderabad, First Published Oct 20, 2021, 1:43 PM IST

workouts వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. రోజువారీ జీవితం ప్రశాంతంగా, హాయిగా గడిచిపోతుంది. రెట్టించిన ఉత్సాహంగా రోజును మొదలుపెట్టడానికి, గడపడానికి వ్యాయామం సహాయపడుతుంది. ఇటీవలి కాలంలో ఆరోగ్యం మీద fitness మీద శ్రద్ధ పెరిగింది. దీనికోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారు.. రెగ్యులర్ వ్యాయామం వల్ల మీ మూడ్ రిఫ్రెష్ అవుతుంది. వ్యాయామం చర్మాన్ని కూడా మెరిపిస్తుంది. 

Skincare tips to follow before, after and during your workouts

అయితే వ్యాయామం చేసేముందు, చేసిన తరువాత.. చేసే సమయంలో skin care విషయంలో రోజువారీ తప్పనిసరి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మసంరక్షణ విషయంలో శ్రద్ధ పెట్టకపోతే జిమ్ లు, పార్కుల్లో రన్నింగులు, యోగాలు చేసి కూడా పెద్దగా ఫలితాలు ఉండవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

దీనికి కారణం Sweat. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం... చెమట పట్టడం అనేది ఆరోగ్యవంతమైన చర్మానికి సూచిక. అయితే, ఎంత వ్యాయామాలు చేసినా చెమట పట్టడం అనేది క్రమం తప్పని చర్మ సంరక్షణ జాగ్రత్తలు తీసుకుంటేనే సాధ్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే త్వరగా Aging shades కనిపించడం, చర్మం నిస్తేజంగా, ఇన్ఫెక్షియస్ గా మారుతుందని దీనివల్ల చర్మం దెబ్బతింటుందని చెబుతున్నారు. 

Skincare tips to follow before, after and during your workouts

ముఖం కడుక్కోవాలి...
దీనికోసం మీ చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేయడానికి వర్కవుట్స్ కి ముందు, తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్కవుట్స్ చేసేముందు తేలికపాటి సబ్బుతో మొహాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత మంచి Moisturizer ను అప్లై చేయాలి. సూర్యకిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. దీంతోపాటు యాంటీపెర్స్పిరెంట్ రోల్-ఆన్ వాడడం వల్ల మీ అండర్ ఆర్మ్స్ లోని చర్మం బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములకు కేంద్రంగా మారకుండా ఉంటుంది. 

మేకప్.. 
ఇక వర్కవుట్స్ చేసేముందు మేకప్ ను తీసేయాలి. మేకప్ వల్ల చర్మ రంధ్రాలు, చెమట గ్రంథులు మూసుకుపోతాయి. దీనివల్ల చర్మానికి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. 

Skincare tips to follow before, after and during your workouts

జుట్టు వదిలేయకూడదు..
అలాగే జుట్టు విరబోసుకుని వర్కవుట్ చేయకూడదు. ఒకవేళ మీ జుట్టు పొట్టిగా ఉంటే. పైకి కట్టుకోండి.  జుట్టుకు వాడిన హెయిర్ ప్రోడక్ట్స్ స్వేధరంద్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. నుదుటిమీద గీతలు, మచ్చలు ఏర్పడడానికి కారణమవుతాయి. అందుకే జుట్టును పైకి కట్టుకోవాలి. 

డిసిన్షెక్షన్
జిమ్ లలో వ్యాయామం చేస్తున్నట్లైతే అక్కడి ఎక్వీప్ మెంట్ వాడేప్పుడు తప్పనిసరిగా Disinsection చేసుకోవాలి.  మీ స్వంత శుభ్రమైన టవల్ ను వాడండి. అలాగే వ్యాయామం చేస్తున్న సమయంలో చేతులతో ముఖాన్ని తాకొద్దు. వ్యాయామం సమయంలో చేతులు మురిగ్గా ఉంటాయి. దీనివల్ల Bacterial Infections వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు ఉద్దేశపూర్వకంగా..  మీ చేతులను మీ ముఖానికి దూరంగా పెట్టాలి.

వ్యాయమం తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 
వ్యాయామానికి ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో, వ్యాయామం తరువాత కూడా అంతే ముఖ్యం. వ్యాయామం తర్వాత చెమటతో ఉన్న ముఖంతో విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ చర్మంలో బ్యాక్టీరియా ఏర్పడడం మొదలవుతుంది. దీనివల్ల మీ ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము, జిడ్డు, చెమటను వదిలించుకోవడానికి చల్లట నీటితో కడుక్కోవాలి. 

Skincare tips to follow before, after and during your workouts

తలస్నానం..
అలాగే వ్యాయామంతో తలలోనూ చెమట పడుతుంది. దీనికోసం వ్యాయామం తరువాత తేలికపాటి షాంపూతో స్నానం చేయండి. అయితే రోజూ తలస్నానం చేయడం మంచిది కాదు. ఇది గుర్తుంచుకోవాలి. బ్లో డ్రైయర్‌కు బదులుగా టవల్ ఉపయోగించండి.

డ్రెస్ ఛేంజ్
దీంతోపాటు వ్యాయామం తరువాత వెంటనే Dress Change చేసుకోవాలి. వ్యాయమం తరువాత చర్మం చెమటను, టాక్సిన్స్ ను విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన టాక్సిన్స్ మామూలగా బట్టలలో చేరతాయి. ఇది Skin pores మూసేస్తాయి. దీనివల్ల శరీరం మీద దద్దుర్లు, మొటిమలకు దారితీస్తుంది. వర్కవుట్స్ సమయంలో శరీరం నుంచి వేడి విడుదలవుతుంది. అందుకే చర్మాన్ని చల్లబరచాలంటే స్నానం చేయడం మంచి ఉపాయం. 

మీరు తీసుకునే ప్రోటీన్ విషంగా మారుతుందా? సంకేతాలివే...

 

Follow Us:
Download App:
  • android
  • ios