Asianet News TeluguAsianet News Telugu

మీకు లైంగిక వ్యసనం ఉందా..?

సాధారణంగా సెక్స్ అందరూ కోరుకుంటారు. కానీ.. దీనికి బానిసగా మారిన వారి ప్రవర్తన కాస్త వింతగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. 

Signs and Symptoms of Sexual Addiction disorder
Author
Hyderabad, First Published Jan 24, 2019, 4:22 PM IST

మద్యపాన వ్యసనం, ధైమపాన వ్యసనం గురించి విన్నాం కానీ.. ఈ లైంగిక వ్యసనం ఏంటి అనుకుంటున్నారా..? దీనినే సెక్స్ ఎడిక్షన్ అని అంటారు. ఈ మధ్యకాలంలో చాలా మందికి ఈ వ్యవసం బారిన పడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. 

సాధారణంగా సెక్స్ అందరూ కోరుకుంటారు. కానీ.. దీనికి బానిసగా మారిన వారి ప్రవర్తన కాస్త వింతగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. మద్యం, డ్రగ్స్ అలవాటు పడినవారు ఎలాగైతే.. రోజూ అవి లేకుండా ఉండలేరో.. ఇది కూడా అలానే ఉంటుంది వాళ్లకి. సెక్స్ అందుబాటులో లేకపోతే తట్టుకోలేరు వాళ్లు. దాని కోసం పరితపించి పోతుంటారు.

సాధారణంగా సెక్స్ తర్వాత అందరూ తృప్తి, ఆనందం, రిలాక్సేషన్ కలుగుతాయి. కానీ ఈ సెక్స్ ఎడిక్టర్లు మాత్రం ఒకరకమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. వారికి సెక్స్ కావాలి అని అనిపించినప్పుడు దానికోసం ఏది చేయడానికి కూడా వెనకాడరు. మంచి, చెడులాంటివి కూడా ఆలోచించరు. వారి కంట్రోల్ లో వాళ్లు ఉండలేరు. ఎవరో వారిని హిప్నటైజ్ చేసి ఇదంతా చేయిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది చూసేవారికి.

అంతెందుకు లైంగిక కోరిక తీర్చుకునే విధానంగా సహజంగా ఉండదు. ప్రతిదీ అసహజంగా కావాలని కోరుకుంటారు. దీని వల్ల భాగస్వాములను దూరం చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారు ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. మంచి వైద్యులను కలవడం బెటర్. 

Follow Us:
Download App:
  • android
  • ios