పీరియడ్స్ సమయంలో సెక్స్ కోరికలు..? ప్రమాదమా?
పీరియడ్స్ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. నూటికి 90శాతం మంది పీరియడ్స్ సమయంలో సెక్స్ కి దూరంగా ఉంటారు.
పీరియడ్స్ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. నూటికి 90శాతం మంది పీరియడ్స్ సమయంలో సెక్స్ కి దూరంగా ఉంటారు. కొంత మంది మాత్రం ధైర్యం చేసి.. ఆ సమయంలో కూడా తమ శృంగార జీవితానికి బ్రేకులు పడకుండా చూసుకుంటారు. అయితే.. నిజానికి పరియడ్స్ లో సెక్స్ సురక్షితమేనా..? దీనివల్ల ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా..? పరిశోధకులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం...
పీరియడ్ సమయంలో సెక్స్ పై పరిశోధకులు 500 మంది అభిప్రాయాలు తీసుకుంటే అందులో 55 శాతం మంది నెలసరి సమయంలో సెక్స్‌తో సౌకర్యవంతంగానే ఉన్నామని చెప్పారు. ఆ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదని అన్నారు. మరో 45 శాతం మంది ఆ సమయంలో సెక్స్ సరికాదని అనలేదు.
అంతెందుకు.. 45శాతం మంది స్త్రీలకు ఆ సమయంలో ఎక్కువ కోరికలు కలుగుతుంటాయని ఓ సర్వేలో తేలింది. ''సెక్స్‌లో పాల్గొనేప్పుడు ఆక్సిటోసిన్ అనే హర్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీన్నే బాండింగ్ హార్మోన్ అని కూడా అంటారు. ప్రసవ సమయంలో కూడా హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. పురిటి నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో హార్మోన్లు సహాయపడుతాయి'' ఓ శాస్త్రవేత్త తెలిపారు.
పీరియడ్స్ పెయిన్ తగ్గించేందుకు.. మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఆ సమయంలో సెక్స్ ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. అయితే.. ఇది చాలా మంది మగవారికి మాత్రం ఇష్టం ఉండదట. ఆ సమయంలో వారికి మాత్రం చిరాకుగా ఉంటుందని వారు చెబుతున్నారు.