Asianet News TeluguAsianet News Telugu

గర్భిణులకు పొగ ‘సెగ’: వైకల్యం.. తక్కువ బరువుతో చిన్నారుల జననం

గర్భిణులు పొగను పీల్చడం వల్ల మృత శిశువుల జననం, చిన్నారులు అంగ వికలాంగులు కావడంతోపాటు అతి తక్కువ బరువుతో జన్మించడం, ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కోవడం వంటి రుగ్మతల బారిన పడుతున్నారు.

Second hand smoke behind thousands of still births: study

ధూమపానం చేసే వారి వల్ల గర్భిణులపై మరింత ఎక్కువగా దుష్ఫ్రభావం చూపుతుందని తాజా అధ్యయనం తేల్చింది. సిగరెట్ల పొగను పీల్చినవారి కంటే పక్కనున్న వారికే ముప్పు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాల్లో 50 శాతానికి పైగా గర్భిణీలు పొగను పీల్చడం ద్వారా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని బ్రిటన్‌లోని యార్క్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు.

30కి పైగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2008-13 వరకు గర్బిణులపై అధ్యయనం చేసిన తర్వాత ఈ పరిశోధనా వివరాలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు పొగను పీల్చడం వల్ల మృత శిశువుల జననం, చిన్నారులు అంగ వికలాంగులు కావడంతోపాటు అతి తక్కువ బరువుతో జన్మించడం, ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కోవడం వంటి రుగ్మతల బారిన పడుతున్నారు.

ముఖ్యంగా పాకిస్థాన్‌లో గర్భంలోనే పిండాలు చనిపోయే ఘటనలు ప్రతి ఏటా 17వేలకు పైగానే నమోదవుతున్నాయి. ధూమపానం చేసే గర్భిణులు మృత శిశువులకు జన్మనిచ్చేది ఒక శాతం కాగా, పొగను పీల్చి ఈ రుగ్మత బారీనపడుతున్న వారు ఏడు శాతానికి పైగా ఉండటమే దిగ్భ్రాంతికరం. భర్తలు ధూమపానం చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న భార్యలు వారి కంటే ఎక్కువగా పొగను పీల్చడం, వంట చేస్తున్న సమయంలో వెలువడే పొగ ద్వారా ఇలాంటి రుగ్మతల బారినపడుతున్నారు. అర్మేనియా, ఇండోనేషియా, జోర్డాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో 50 శాతానికి పైగా గర్భిణులు ఇంట్లోనే పొగబారిన పడుతున్నారని అధ్యయన నివేదిక వెల్లడించింది.

చైనాలో గర్భస్రావానికి దారితీస్తున్న దుమపానం
చైనాలో పాసివ్ స్మోకింగ్ ప్రభావంతో మహిళలు తమ గర్భ స్రావానికి గురవుతున్నారు. 2010 - 16 మధ్య 58 లక్షల దంపతుల్లో 17 శాతం మంది మహిళలు పాసివ్ స్మోకింగ్ వల్లే గర్భస్రావం పాలవుతున్నారు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దుమపానం చేయని పురుషుల జీవిత భాగస్వాముల్లో 2.38 శాతం మంది గర్భస్రావం చేయించుకుంటూ ఉంటే, మొత్తం దంపతుల్లో 2.92 శాతం మంది గర్భస్రావం చేయించుకునే పరిస్థితి నెలకొంది. మా క్సూ అనే పరిశోధకుడు మాట్లాడుతూ భర్తలు దుమపానానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios